Kcr : క్యూలో సీనియర్లు… ఝలక్ తప్పదా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పదవుల భర్తీ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. పైగా ఇక సాధారణ ఎన్నికలకు రెండేళ్లే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీల ఎన్నిక జరగాల్సి [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పదవుల భర్తీ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. పైగా ఇక సాధారణ ఎన్నికలకు రెండేళ్లే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీల ఎన్నిక జరగాల్సి [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పదవుల భర్తీ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. పైగా ఇక సాధారణ ఎన్నికలకు రెండేళ్లే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీల ఎన్నిక జరగాల్సి ఉంది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ ఆరు ఎమ్మెల్సీలు అధికార టీఆర్ఎస్ ఖాతాలోనే పడతాయి. ఆశావహుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వాస్తవానికి వీరి పదవీకాలం ఈ ఏడాది జూన్ లోనే ముగిసింది.
ఆరు ఎమ్మెల్సీ పోస్టులు….
అయితే కరోనా కారణంగా ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆశావహులు పదవులపై ఆశలు పెట్టుకున్నారు. కేసీఆర్ ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేసీఆర్ తమకు మాట ఇచ్చారని కొందరు ధీమా వ్యక్తం చేస్తుండగా మరికొందరు సామాజిక సమీకరణాల నేపథ్యంలో తమకు పదవి వస్తుందని నమ్ముతున్నారు.
ఆశావహుల్లో టెన్షన్…
ప్రధానంగా గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, కర్నె ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, మధుసూదనాచారి వంటి నేతలు ఎమ్మెల్సీ పదవులలో పోటీ లో ఉన్నారు. వీరంతా సీనియర్లు కావడం, ఎన్నికల వేళ సామాజిక సమీకరణాలు కూడా అనుకూలంగా ఉండటంతో ధీమాగా ఉన్నారు. కానీ అక్కడ ఉన్నది కేసీఆర్. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఆయన ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేస్తారు.
ఎన్నికల తర్వాత మరికొందరికి….
ఎవరూ ఊహించని విధంగా ఇటీవల గవర్నర్ కోటాలో హుజూరాబాద్ కు చెందిన కౌశిక్ రెడ్డి ఎంపిక ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. జిల్లాల వారీగా పదవులకు ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే కేసీఆర్ దీనిపై ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలిసింది. సీనియర్లలో కొందరిక మాత్రమే అవకాశం ఉంటుందంటున్నారు. ఎన్నికల దృష్ట్యా ఎక్కువగా సామాజికవర్గాల సమీకరణకే కేసీఆర్ ప్రాధాన్యం ఇవ్వనున్నారు.