Kcr : కేసీఆర్ కీలక డెసిషన్.. ఆ పార్టీ నుంచి వస్తే ఉద్వాసన
తెలంగాణలో మంత్రి వర్గాన్ని ప్రక్షాళన చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఈసారి ఎన్నికల్లో గెలిచేందుకు సిద్ధమవుతున్న కేసీఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నేతలకు షాకివ్వనున్నారని తెలిసింది. [more]
తెలంగాణలో మంత్రి వర్గాన్ని ప్రక్షాళన చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఈసారి ఎన్నికల్లో గెలిచేందుకు సిద్ధమవుతున్న కేసీఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నేతలకు షాకివ్వనున్నారని తెలిసింది. [more]
తెలంగాణలో మంత్రి వర్గాన్ని ప్రక్షాళన చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఈసారి ఎన్నికల్లో గెలిచేందుకు సిద్ధమవుతున్న కేసీఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నేతలకు షాకివ్వనున్నారని తెలిసింది. ఈసారి ఎన్నికలకు సెంటిమెంట్ తోనే వెళ్లాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. అయితే విపక్షాల నుంచి విమర్శలకు దూరమయ్యేందుకు టీడీపీ నుంచి వచ్చిన వారిని వీలయినంత మందిని తగ్గించాలన్న యోచనలో ఉన్నారు.
రెండుసార్లు గెలిచి….
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ రెండు సార్లు గెలిచింది. అయితే రెండుసార్లు కేసీఆర్ తన మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారని, ఉద్యమ కాలం నుంచి తనతో వెన్నంటి ఉన్నవారికి పదవులు ఇవ్వలేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. విపక్షాలు కూడా తెలంగాణ ద్రోహులకు పదవులు కట్టబెట్టారని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. దీంతో కేసీఆర్ ఆ విమర్శల నుంచి తప్పించుకోవడానికి టీడీపీ నుంచి వచ్చిన నేతలను ఈసారి విస్తరణలో పక్కన పెట్టాలని భావిస్తున్నట్లు తెలియవచ్చింది.
టీడీపీ నుంచి వచ్చి….
కేసీఆర్ మంత్రి వర్గంలో 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ తదితరులున్నారు. వీరిలో ఎక్కువ మందిని తప్పించే అవకాశాలున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి నేరుగా టీఆర్ఎస్ లో చేరి యాక్టివ్ గా ఉన్నప్పటికీ రానున్న ఎన్నికల దృష్ట్యా వీరిలో కొందరికి ఉద్వాసన చెప్పే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.
కాంగ్రెస్ నేతలు సేఫ్….?
కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి కూడా మంత్రి పదవులు కేసీఆర్ ఇచ్చారు. సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ వంటి వారు ఉన్నప్పటికీ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంతో వారికి ఇబ్బంది లేదని అంటున్నారు. టీడీపీ నుంచి వచ్చిన మంత్రులు వచ్చే విస్తరణలో డేంజర్ జోన్ లోనే ఉన్నట్లు కనపడుతుంది. ముఖ్యంగా మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి నేతలను తప్పించే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.