ఎవరినీ వదలొద్దు.. కండువా కప్పేయండి
హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగనుంది. ఇంకా నోటిఫికేషన్ వెలువడకపోయినా పార్టీల వ్యూహాలు అంతుచిక్కకుండా ఉన్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హుజూరాబాద్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. [more]
హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగనుంది. ఇంకా నోటిఫికేషన్ వెలువడకపోయినా పార్టీల వ్యూహాలు అంతుచిక్కకుండా ఉన్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హుజూరాబాద్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. [more]
హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగనుంది. ఇంకా నోటిఫికేషన్ వెలువడకపోయినా పార్టీల వ్యూహాలు అంతుచిక్కకుండా ఉన్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హుజూరాబాద్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రతిరోజూ సమీక్ష చేస్తున్నారు. ఫోన్లలో నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో పాటు అక్కడ ఈటల రాజేందర్ ను బలహీనం చేసే ప్రతి అంశాన్ని పరిశీలించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంపై కేసీఆర్ నేతలకు మార్గనిర్దేశనం చేస్తున్నారు.
నిత్యం టచ్ లో….
కేసీఆర్ ఫోన్ వచ్చిందంటే కరీంనగర్ జిల్లా నేతలు హడలి పోతున్నారు. తమకు తెలియని విషయాలను కూడా కేసీఆర్ గుర్తించి చెప్పడంతో నేతలు కంగుతింటున్నారు. ప్రధానంగా హుజూరాబాద్ లో దళితులు, చేనేత వర్గాలను ఆకట్టుకునే పనిలో అధికార పార్టీ ఉంది. ఈ రెండు వర్గాలు చేరువయితే తమ గెలుపునకు తిరుగుండదని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే చేనేత వర్గానికి చెందిన టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్. రమణను పార్టీలోకి తీసుకు వచ్చారు.
ఈ రెండు వర్గాలను…
ఇక దళితులను ఆకట్టుకునేందుకు దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గం నుంచే ప్రారంభించారు. దీంతో దళిత ఓట్లు తమకు అనుకూలంగా మారతాయని అంచనా వేస్తున్నారు. ఎక్కువ ఓట్లు ఉన్న కులాలకు ఇప్పటికే గాలం వేశారు. ఆ కులాలకు చెందిన నేతలను రంగంలోకి దించి వారికి అన్ని రకాల ప్రయోజనం చేకూరుస్తున్నారు. హామీలు కూడా గట్టిగానే ఇస్తున్నారు. ఈటల రాజేందర్ పాదయాత్ర ప్రారంభించడంతో కేసీఆర్ మరింత అప్రమత్తమయ్యారు.
కాంగ్రెస్ ను ఖాళీ చేస్తారా?
హుజూరాబాద్ లో ఎవరు తమ పార్టీలోకి వస్తామన్నా చేర్చుకుంటున్నారు. కోదండరామ్ తాము ఎన్నికల బరిలో ఉంటామని అలా ప్రకటించగానే ఆ పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ శ్రీశైల్ రెడ్డికి గులాబీ కండువా కప్పేశారు. ఇక కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ ఇక్కడ పూర్తిగా టార్గెట్ చేశారు. గత ఈటలపై పోటీచేసి ఓడిపోయిన కౌశిక్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకున్నారు. పది ఓట్లు తెస్తాడన్న నమ్మకం ఉన్న నేతను కూడా వదిలిపెట్టకుండా కండువా కప్పేయాలన్న కేసీఆర్ ఆదేశాలను గులాబీ పార్టీ నేతలు అమలు చేస్తున్నారు. మొత్తం మీద నేతలు వచ్చినంత మాత్రాన గెలుపు దక్కుతుందా? అన్నది ఫలితాల తర్వాత కాని తేలదు.
.