షాకిస్తారా? హ్యాండ్ అందిస్తారా?
ఆర్టీసీ కార్మికుల సమస్యపై నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్టీసీ కార్మికులు తెలంగాణలో సమ్మె చేపట్టి 52 రోజులు కావస్తుంది. అయినా [more]
ఆర్టీసీ కార్మికుల సమస్యపై నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్టీసీ కార్మికులు తెలంగాణలో సమ్మె చేపట్టి 52 రోజులు కావస్తుంది. అయినా [more]
ఆర్టీసీ కార్మికుల సమస్యపై నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్టీసీ కార్మికులు తెలంగాణలో సమ్మె చేపట్టి 52 రోజులు కావస్తుంది. అయినా సమ్మె విరమణ జరగలేదు. ప్రభుత్వం కార్మికుల డిమాండ్లకు తలొంచక పోవడంతో సమ్మె కొనసాగుతోంది. డిమాండ్లను పక్కన పెట్టి తాము సమ్మెను విరమిస్తామని కార్మిక సంఘాలు ప్రకటించినప్పటికీ ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
నెగిటివ్ ధోరణితోనే….
ఆర్టీసీపై తొలి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ నెగిటివ్ గానే ఉన్నారు. యూనియన్లు కార్మికులను పక్క దోవపట్టిస్తూ నష్టాలకు కారణమవుతున్నారని ఆయన భావిస్తున్నారు. అంతేకాదు ఆర్టీసీని యధాస్థితిగా కొనసాగించడానికి కూడా కేసీఆర్ తొలి నుంచి ఇష్టపడటం లేదు. రూట్ల ప్రయివేటీకరణతో పాటుగా యూనియన్లను కూడా అదుపులో పెట్టాలని కేసీఆర్ నిర్ణయించు కున్నారు. ఇదే మాట పలు దఫాలు మీడియా సమావేశంలోనూ వెల్లడించారు.
ప్రయివేటీకరణ దిశగా….
కార్మిక సంఘాలు హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. హైకోర్టు కూడా ఆర్టీసీ సమ్మెపై తాము జోక్యం చేసుకోలేమని, కార్మిక న్యాయస్థానం విచారణ చేపట్టి సమ్మె పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొంది. అంతేకాకుండా తాజాగా రూట్ల ప్రయివేటీకరణకు కూడా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో తెలంగాణలోని 5,100 రూట్లను ప్రయివేటీకరణ చేసే దిశగా కేసీఆర్ అడుగులు ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
నిర్ణయంపై ఉత్కంఠ….
మరోవైపు ఆర్టీసీ కార్మికులు రెండు నెలల నుంచి జీతాలు లేక అలమటించి పోతున్నారు. కేసీఆర్ విధుల్లో చేరమని చెప్పిన వెంటనే జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ కేసీఆర్ ఎలాంటి షరతులు పెడతారన్నది ఆసక్తి కరంగా మారింది. యూనియన్ లో ఉండబోమని రాతపూర్వకంగా రాసిఇవ్వాలన్నది కూడా కేసీఆర్ షరతుల్లో ఒకటి అని తెలుస్తోంది. అలాగే ఆర్టీసీ కార్మికులకు వీఆర్ఎస్ ఇచ్చే యోచనలో కూడా కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. సోమవారం దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే అవకాశముందని తెలిసింది. మొత్తం మీద దాదాపు 49 వేల మంది ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.