Kcr : కేసీఆర్ కు సీన్ అర్థమవుతుందా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లో రెండోసారి గెలిచిన తర్వాత చాలా మార్పు కన్పిస్తుంది. తొలిసారి ఆయన పాలనలో అసలు విపక్షాలను లెక్క కూడా చేయలేదు. తన వద్దకు [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లో రెండోసారి గెలిచిన తర్వాత చాలా మార్పు కన్పిస్తుంది. తొలిసారి ఆయన పాలనలో అసలు విపక్షాలను లెక్క కూడా చేయలేదు. తన వద్దకు [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లో రెండోసారి గెలిచిన తర్వాత చాలా మార్పు కన్పిస్తుంది. తొలిసారి ఆయన పాలనలో అసలు విపక్షాలను లెక్క కూడా చేయలేదు. తన వద్దకు వచ్చేందుకు వారికి కనీసం అవకాశం కూడా ఇవ్వలేదు. కేవలం కండువా కప్పేందుకే ప్రగతి భవన్ కు విపక్ష నేతలను రమ్మనేవారు. అలాగే అందరినీ తన పార్టీలో చేర్చుకున్నారు. ఇక రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్, టీడీపీ నేతలను తమ పార్టీలోకి కేసీఆర్ చేర్చుకున్నారు.
ఆ ఎన్నికల తర్వాత….
అయితే పార్లమెంటు ఎన్నికలు, దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్ లో కొంత మార్పు వచ్చినట్లు కనపడుతుంది. ఆయన జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత కొంత ఉందని కేసీఆర్ గ్రహించడమే కారణం. తొలి దఫా వచ్చినప్పుడు కేసీఆర్ కేవలం కార్యాలయానికే పరిమితమయ్యేవారు. ఎన్నికలు వచ్చినప్పడు మాత్రమే జనంలోకి వెళ్లేవారు. కానీ రెండోసారి అలా కాదు. తనకు కొంత ఇబ్బంది ఉందని గ్రహించిన కేసీఆర్ జిల్లాలను కూడా పర్యటిస్తున్నారు.
దగ్గరకు తీసుకుంటూ….
ఇక విపక్ష పార్టీలను దూరం పెట్టిన కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వారితో కొంత కలసి పని చేయాలని నిర్ణయానికి వచ్చినట్లే కనపడుతుంది. తొలి దఫాలో అఖిలపక్ష సమావేశాలను కూడా ఏ అంశంపైన కూడా కేసీఆర్ ఏర్పాటు చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం అఖిలపక్షం అంటూ కేసీఆర్ గొంతు సవరించుకున్నారు. దళిత బంధు పథకంపై ఇప్పటికే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
అనేక అంశాలపై….
అలాగే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వ్యయంపై కూడా కేసీఆర్ అఖిలపక్ష సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇలా కేసీఆర్ లో గతంలో కంటే బలమైన మార్పు కన్పిస్తుందన్నది విశ్లేషకులు సయితం అంగీకరిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం టీఆర్ఎస్ రెండు దఫాలుగా అధికారంలో ఉండటంతో సహజంగా వచ్చే వ్యతిరేకతతో పాటు బీజేపీ, కాంగ్రెస్ లు బలపడుతుండటమే.