Trs : హుజూరాబాద్ ఎన్నిక తర్వాత ఆ గొంతులు పెరుగుతాయా?
తెలంగాణ రాష్ట్ర సమితిలో అసమ్మతి, అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పడైనా బయటపడే వీలుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఏదైనా తేడా కొడితే సీనియర్ నేతలు సయితం [more]
తెలంగాణ రాష్ట్ర సమితిలో అసమ్మతి, అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పడైనా బయటపడే వీలుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఏదైనా తేడా కొడితే సీనియర్ నేతలు సయితం [more]
తెలంగాణ రాష్ట్ర సమితిలో అసమ్మతి, అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పడైనా బయటపడే వీలుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఏదైనా తేడా కొడితే సీనియర్ నేతలు సయితం కేసీఆర్ పై గళం విప్పే అవకాశముంది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. తమను పార్టీ ఎదగడానికి ఉపయోగించుకుని, ఆ తర్వాత వదిలేయడంపై అనేక మంది నేతలు గుర్రుగా ఉన్నారు. వారంతా సమయం కోసం వేచిచూస్తున్నారు.
ఇతర పార్టీల నుంచి…
తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత అనేక మంది నేతలు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరారు. కేసీఆర్ ఆహ్వానం మేరకే వారంతా వచ్చి పదవులను కూడా పొందరు. ప్రధానంగా తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, పాంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు కేసీఆర్ తో ఉద్యమకాలం నుంచి నడిచిన మధుసూదనాచారి వంటి నేతలు కూడా ఇప్పుడు పదవులు లేక అధికారానికి దూరంగా ఉన్నారు.
కోటరీ మారింది….
ఒకప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కోటరీలో ప్రధానంగా ఉండేవీరిని పక్కన పెట్టారు. ఇప్పుడు కేసీఆర్ కోటరీలోకి కొత్త నేతలు వచ్చి చేరిపోయారు. ఎమ్మెల్సీ పదవి అయినా వస్తుందన్న ఆశ వీరికి నిన్నమొన్నటి వరకూ ఉండేది. కానీ కొత్తగా వచ్చి చేరే వాళ్లకే కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తుండటం చూసి ఆ నమ్మకం కూడా సన్నగిల్లింది. తమను ఇక కేసీఆర్ పట్టించుకోరన్న నిరాశలోకి కొందరు వెళ్లిపోగా మరికొందరు పార్టీని వీడితే ఎలా ఉంటుందన్న దానిపై తర్జన భర్జన పడుతున్నారు.
ఏ పార్టీలోకి వెళ్లాలన్నా….
తెలంగాణలో సరైన విపక్షం లేకపోవడం, బీజేపీ అధికారంలోకి వస్తుందన్న గ్యారంటీ లేదు. ఇక కాంగ్రెస్ కోలుకుంటుందన్న నమ్మకం లేదు. దీంతో టీఆర్ఎస్ లోనే ఉండటం తప్ప వారికి వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ ఉంటే అధికార పార్టీలో ఉన్నామన్న గుర్తింపు అయినా ఉంటుంది. అందుకే అనేకమంది నేతలు వెనక్కు తగ్గుతున్నారు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత సమీకరణాలు మారే అవకాశమున్నందున అప్పడు వీరు గొంతులు పెంచే అవకాశాలు కన్పిస్తున్నాయి.