kcr : ముందస్తు కు వెనకడుగు ఇందుకేనట
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారని ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఆయన స్పష్టత ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలన్నది కేసీఆర్ నిర్ణయం. అందుకు [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారని ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఆయన స్పష్టత ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలన్నది కేసీఆర్ నిర్ణయం. అందుకు [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారని ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఆయన స్పష్టత ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలన్నది కేసీఆర్ నిర్ణయం. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని కేసీఆర్ చెప్పడాన్ని విపక్షాలను ఇరుకునపెట్టేయాలనే. తెలంగాణాలో సాధారణ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. 2022లో ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్లు ఇటీవల విస్తృతంగా ప్రచారం జరిగింది.
గతం వేరు….
2014లో ఎన్నికల అనంతరం కేసీఆర్ కు అనుకున్న మెజారిటీ రాలేదు. కాంగ్రెస్, టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు ఫిరాయించారు. అయితే ఆయనకు సంతృప్తికరంగా లేకపోవడం, బీజేపీ రాష్ట్రంలో పుంజుకుంటుండటాన్ని గమనించి గత ఎన్నికలలో ఒక ఏడాది మిగిలి ఉండగానే ఎన్నికలకు వెళ్లారు. 2018 లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ కు పూర్తి స్థాయి మెజారిటీని ప్రజలు కట్టబెట్టారు. దీంతో ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళతారని అంతా అనుకున్నారు.
పథకాల అమలుకు….
కానీ ఇప్పుడు కేసీఆర్ అనేక పథకాలను అమలు చేయాల్సి ఉంది. దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు అంటే ఈ పథకానికి నిధుల సమస్య ఎదురవుతుంది. లక్షకు పైగా కోట్లను సమీకరించాల్సి రావడంతో ఏడాది సమయం సరిపోదు. అందుకే ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదు. దీంతో పాటు మరికొన్ని పథకాలను కూడా కేసీఆర్ అమలు చేయాల్సి ఉంది.
కాంగ్రెస్ బలపడితే…?
దీంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ మరింత బలపడాల్సి ఉంది. కాంగ్రెస్ కొంత బలపడితేనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశముంటుంది. ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్లకపోవడానికి కూడా ఇది ఒక కారణం. రెండేళ్లలో కాంగ్రెస్ కొంత బలపడితే బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చుకోగలిగితే తాను లబ్ది పొందవచ్చన్నది కేసీఆర్ వ్యూహంగా కన్పిస్తుంది. మొత్తం మీద ముందస్తు ఆలోచనలను ఏవీ లేవని కేసీఆర్ చెప్పి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కొంత ఊరట కల్గించారనే చెప్పాలి.