Kcr : ఇద్దరూ కేసీఆర్ కు కంట్లో నలుసుగా మారారే?
తెలంగాణ రాష్ట్ర సమితికి పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన వారే శత్రువులుగా మారుతున్నారు. కేసీఆర్ వ్యూహాలను దగ్గర నుంచి చూసిన వారే ఆయనకు రాజకీయంగా ఇబ్బందిగా మారారు. [more]
తెలంగాణ రాష్ట్ర సమితికి పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన వారే శత్రువులుగా మారుతున్నారు. కేసీఆర్ వ్యూహాలను దగ్గర నుంచి చూసిన వారే ఆయనకు రాజకీయంగా ఇబ్బందిగా మారారు. [more]
తెలంగాణ రాష్ట్ర సమితికి పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన వారే శత్రువులుగా మారుతున్నారు. కేసీఆర్ వ్యూహాలను దగ్గర నుంచి చూసిన వారే ఆయనకు రాజకీయంగా ఇబ్బందిగా మారారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమికి కేసీఆర్ పార్టీ నుంచి బయటకు పంపిన వారే ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. వారు కేసీఆర్ మీద కసితో పనిచేసి మరీ బీజేపీని గెలిపించారు. ఇది టీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారింది.
తమ వ్యూహాలతో….
టీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్ లు బయటకు వచ్చారు. వారిద్దరూ కేసీఆర్ మీద కసితో ఉన్నారు. వారిద్దరూ బీజేపీలో చేరి తమ ప్రాధాన్యతను నిరూపించుకోవాలనుకున్నారు. ఇద్దరీకి రెండు ఉప ఎన్నికలు అంది వచ్చినట్లయింది. కేసీఆర్ వ్యూహాలకు ప్రతిగా వ్యూహాలను రచించి దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించుకున్నారు. వారిద్దరూ ఇప్పుడు బీజేపీలోనూ హీరోలుగా మారారు.
కేసీఆర్ ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో..
మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కేసీఆర్ కు నమ్మకమైన నేతగా ఉన్నారు. ఆయన మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా కూడా గెలిచారు. అయితే క్రమంగా జితేందర్ రెడ్డిని కేసీఆర్ పక్కన పెట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సత్సంబంధాలు నెరపుతున్నారని భావించి కేసీఆర్ ఆయనకు టిక్కెట్ కూడా ఇవ్వలేదు. దీంతో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీకి కీలకంగా మారారు.
బీజేపీలో చేరి….
మరో మాజీ ఎంపీ వివేక్. ఈయన తొలి నుంచి కాంగ్రెస్ లో ఉండేవారు. రాష్ట్ర విభజనకు ముందు టీఆర్ఎస్ లోకి వచ్చి తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ లో చేరినా ఆయనకు కేసీఆర్ ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో వివేక్ బీజేపీలో చేరారు. దుబ్బాక, హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థులకు ఆర్థికంగా, సామాజికంగా వివేక్ అండగా నిలిచి వారి గెలుపునకు దోహదం చేశారు. ఇలా కేసీఆర్ బయటకు పంపిన ఇద్దరు నేతలు ఆయనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. హుజూరాబాద్, దుబ్బాకలో బీజేపీ అభ్యర్థులు బలమైన నేతలే అయినా వీరి వ్యూహాలు ఫలించే గెలుపు సాధ్యమయింది.