బ్రేకింగ్ : తెలంగాణలో మే 7వ తేదీ వరకూ లాక్ డౌన్
తెలంగాణలో ఎలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లేవన్నారు. వరంగల్, యాదాద్రి, సిద్ధిపేట, వనపర్తి [more]
తెలంగాణలో ఎలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లేవన్నారు. వరంగల్, యాదాద్రి, సిద్ధిపేట, వనపర్తి [more]
తెలంగాణలో ఎలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లేవన్నారు. వరంగల్, యాదాద్రి, సిద్ధిపేట, వనపర్తి జిల్లాల్లో కరోనా కేసులు లేవన్నారు. ఇప్పటి వరకూ 858 కేసులు తెలంగాణలో నమోదయ్యాయన్నారు. తెలంగాణలో కేసులు రెట్టింపు కావడానికి పది రోజులు పడుతుందన్నారు. మే 3వతేదీ వరకూ కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిందని, రేపటి నుంచి కొన్ని సడలింపులు ఇచ్చిందన్నారు. అయితే మంత్రివర్గంలో చర్చించిన తర్వాత తెలంగాణలో రేపటి నుంచి ఎలాంటి మినహాయింపులు ఉండబోవన్నారు. ఏ రంగానికి తెలంగాణలో లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఇవ్వడం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఎలాంటి మినహాయింపులుండవ్…..
మే 1వ తేదీ తర్వాత తెలంగాణ కరోనా నుంచి బయటపడే అవకాశముందన్నారు. మే నుంచి కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందన్నారు. లాక్ డౌన్ యధాతధంగా అమలవుతుందన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ చెప్పారు. గతంలో ఉన్న నిబంధనలే అమలులో ఉంటాయన్నారు. కేసులు పెరగకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ జరిపామన్నారు. 94 శాతం మంది లాక్ డౌన్ ను పొడిగించాలన్నారు. దీంతో మే 7వ తేదీ వరకూ తెలంగాణలో లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. మే 5వ తేదీన తిరిగి మంత్రి వర్గం సమావేశమై లాక్ డౌన్ పై సమీక్షిస్తుందని కేసీఆర్ తెలిపారు. స్విగ్గీ, జొమాటో వంటి వాటిపై కూడా నిషేధం కొనసాగుతుందన్నారు. నిత్యావసర వస్తువులు మాత్రం తెప్పించుకోవచ్చన్నారు. సామూహిక ప్రార్థనలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించే ప్రసక్తి లేదన్నారు.