కదిరి కింగ్ ఎవరవుతారు..?
2014 ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన రెండు నియోజకవర్గాల్లో కదిరి ఒకటి. ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ పై [more]
2014 ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన రెండు నియోజకవర్గాల్లో కదిరి ఒకటి. ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ పై [more]
2014 ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన రెండు నియోజకవర్గాల్లో కదిరి ఒకటి. ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ పై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అత్తర్ చాంద్ బాషా కేవలం 968 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. తర్వాత చాంద్ బాషా తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టిక్కెట్ కోసం కందికుంట వెంకటప్రసాద్, చాంద్ బాషా చివరి నిమిషం వరకు ప్రయత్నంగా టిక్కెట్ వెంకటప్రసాద్ కే దక్కింది. దీంతో ఎమ్మెల్సీ పదవి అయినా దక్కుతుందనే ఆశతో చాంద్ బాషా పార్టీలోనే కొనసాగారు. ఇక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి కదిరిలో డా.పీవీ సిద్ధారెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టింది. దీంతో వెంకటప్రసాద్, సిద్ధారెడ్డి మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచింది. ఇద్దరూ తమ గెలుపుపై ధీమాగా ఉన్నారు.
తెలుగుదేశం పార్టీలో వర్గపోరు
కదిరి నియోజకవర్గంలో కందికుంట వెంకటప్రసాద్ 15 ఏళ్లుగా టీడీపీకి పెద్దదిక్కుగా ఉంటున్నారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయగా 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినందున ఆయనపై నియోజకవర్గంలో కొంత సానుభూతి ఉంది. ఆయనకు వ్యక్తిగతంగానూ ఇక్కడ మంచి పేరే ఉంది. ప్రజలకు అందుబాటులో ఉంటారనే ముద్ర ఉంది. అయితే, టీడీపీలో వర్గపోరు ఆయనకు ఇబ్బందికరంగా మారింది. ఎమ్మెల్యే చాంద్ బాషా పార్టీలో చేరిన నాటి నుంచి టీడీపీ రెండు వర్గాలుగా చీలింది. వీరి వర్గపోరు వల్లే నియోజకవర్గం అభివృద్ధి జరగలేదనే భావన ప్రజల్లో బలంగా ఉంది. ప్రభుత్వ పథకాలు సైతం టీడీపీకి అనుకూలంగా ఉండే వారికి దక్కాయని మిగతా వారు భావిస్తున్నారు. వైసీపీపై గెలిచి పార్టీ ఫిరాయించిన చాంద్ బాషాపై వ్యతిరేకత కూడా ఎక్కువగా ఉంది. ఆయన టీడీపీలో ఉన్నందున ఆయనపై ఉన్న వ్యతిరేకత పార్టీకి ఇబ్బందిగా మారింది.
ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీనే
వైసీపీ నుంచి ఇద్దరు నేతలు టిక్కెట్ ఆశించగా చివరకు డా.పీవీ సిద్ధారెడ్డికి టిక్కెట్ దక్కింది. డాక్టర్ గా ఆయన నియోజకవర్గ ప్రజలకు తెలిసిన వ్యక్తే. సౌమ్యుడిగా పేరుంది. వైసీపీలోనూ వర్గ విభేదాలు పార్టీకి కొంత చేటు చేశాయి. కదిరి నియోజకవర్గంలో సామాజకవర్గ సమీకరణాలు గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. ఇక్కడ రెడ్లు, ముస్లింలు, బలిజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. రెడ్లు వైసీపీకి అండగా ఉన్నట్లు కనిపిస్తోంది. ముస్లింలు సైతం ఎక్కువగా వైసీపీ వైపే నిలిచారు. అయితే, కందికుంట బీసీ వర్గానికి చెందిన వారు కావడంతో ఆ సామాజకవర్గం ఓటర్లు ఆయన వైపు మొగ్గు చూపినట్లు భావిస్తున్నారు. మొత్తంగా గత ఎన్నికలలానే ఈసారి కూడా కదిరి నియోజకవర్గంలో హోరాహోరీ పోరు జరిగింది. ఇద్దరూ విజయంపై ధీమాగా ఉన్నారు. ఎవరు గెలిచినా స్వల్ప మెజారీటీతో గట్టెక్కే అవకాశం ఉంది.