కడియంకు మళ్లీ మంచిరోజులొచ్చినట్లేనా?
సీనియర్ నేత కడియం శ్రీహరికి మళ్లీ మంచిరోజులొచ్చినట్లే. ఆయనకు మళ్లీ తొలి రోజుల్లో లభించిన ప్రాధాన్యత పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఇప్పుడు లభిస్తుందని చెబుతున్నారు. ప్రధానంగా తెలంగాణలో కడియం [more]
సీనియర్ నేత కడియం శ్రీహరికి మళ్లీ మంచిరోజులొచ్చినట్లే. ఆయనకు మళ్లీ తొలి రోజుల్లో లభించిన ప్రాధాన్యత పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఇప్పుడు లభిస్తుందని చెబుతున్నారు. ప్రధానంగా తెలంగాణలో కడియం [more]
సీనియర్ నేత కడియం శ్రీహరికి మళ్లీ మంచిరోజులొచ్చినట్లే. ఆయనకు మళ్లీ తొలి రోజుల్లో లభించిన ప్రాధాన్యత పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఇప్పుడు లభిస్తుందని చెబుతున్నారు. ప్రధానంగా తెలంగాణలో కడియం శ్రీహరికి చెందిన సామాజిక వర్గం అధికార టీఆర్ఎస్ పార్టీ పై గుర్రుగా ఉందని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో ఆయనకు మళ్లీ ప్రయారిటీ ఇచ్చి ఆ వర్గాన్ని తమ వైపునకు తిప్పుకోవాలన్నది కేసీఆర్ ఆలోచనగా ఉంది.
మంచి ప్రాధాన్యత…..
తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఉన్నతపదవులను చేపట్టిన కడియం శ్రీహరి సుదీర్ఘకాలం ఆ పార్టీలోనే కొనసాగారు. రాష్ట్ర విభజనకు ముందే ఆయన టీఆర్ఎస్ లో చేరారు. వరంగల్ జిల్లాలో బలమైన నేతగా ఉన్న కడియం శ్రీహరికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉంది. 2014ఎన్నికల్లో కడియం శ్రీహరి ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే అప్పట్లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న రాజయ్యపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనను తొలగించి కేసీఆర్ తన కేబినెట్ లో చోటు కల్పించారు. ఎమ్మెల్సీని చేసి ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.
రెండేళ్ల నుంచి దూరంగా…
అయితే 2018 ఎన్నికల నుంచి మాత్రం కడియం శ్రీహరిని కేసీఆర్ దూరం పెట్టారు. రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహరి గత ఎన్నికల్లో తన కుమార్తెకు స్టేషన్ ఘన్ పూర్ టిక్కెట్ ను కోరారు. దానికి కూడా కేసీఆర్ అంగీకరించలేదు. తిరిగి స్టేషన్ ఘన్ పూర్ టిక్కెట్ ను రాజయ్య కే ఇచ్చారు. దాదాపు రెండేళ్ల నుంచి కడియం శ్రీహరి అసంతృప్తితో అలానే ఉన్నారు.
అదే జరిగితే?
అయితే సీనియర్లకు మంచి ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ప్రభుత్వంలో సీనియర్ల సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఎటూ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉండటంతో కడియం శ్రీహరికి పెద్ద బాధ్యతలను అప్పగిస్తారన్న టాక్ గులాబీ పార్టీలో ప్రచారం నడుస్తోంది. మరి కడియం శ్రీహరికి మంచి రోజులొచ్చాయా? లేదా? అన్నది రాబోయే రోజుల్లో తెలియనుంది.