కళా ఫ్యామిలీకి రెండు చోట్లా చెక్…?
కళా వెంకట్రావు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని నేత. ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీలోనే ఉన్న కళా మధ్యలో ప్రజారాజ్యంలోకి జంప్ చేసి తిరిగి పార్టీలోకి [more]
కళా వెంకట్రావు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని నేత. ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీలోనే ఉన్న కళా మధ్యలో ప్రజారాజ్యంలోకి జంప్ చేసి తిరిగి పార్టీలోకి [more]
కళా వెంకట్రావు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని నేత. ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీలోనే ఉన్న కళా మధ్యలో ప్రజారాజ్యంలోకి జంప్ చేసి తిరిగి పార్టీలోకి వచ్చారు. కళా వెంకట్రావు పార్టీ మారి వచ్చినా కూడా చంద్రబాబు ఆయనను తిరుగులేని అందలం ఎక్కించారు. ముందుగా కళా వెంకట్రావు మరదలు మృణాళిని జిల్లా మార్చి విజయనగరం తీసుకువచ్చి చీపురుపల్లి సీటు ఇచ్చారు. ఆమె గెలిచిన వెంటనే కేబినెట్ లోకి తీసుకున్నారు. 2017లో ఆమెను కేబినెట్ నుంచి తప్పించి కళా వెంకట్రావుకు మంత్రి పదవితో పాటు ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి కూడా ఇచ్చారు. గత ఎన్నికల్లో ఆయన రాజకీయంగా చాలా జూనియర్ అయిన కిరణ్కుమార్ చేతిలో చిత్తుగా ఓడిపోయారు.
ఎనలేని ప్రాధాన్యత…..
కళా వెంకట్రావు ఎన్నితప్పులు చేసినా చంద్రబాబు ఆ ఫ్యామిలీని నెత్తిన పెట్టుకుంటున్నారు. రాజాం నియోజకవర్గానికి చెందిన ఆయనకు రాజం ఎస్సీ రిజర్వ్ కావడంతో ఎచ్చెర్ల సీటు ఇచ్చారు. ఇక కళా మరదలకు చీపురుపల్లి సీటు ఇచ్చి మంత్రిని చేయడమే గొప్ప విషయం అనుకుంటే.. గత ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో చీపురుపల్లి సీటు కోసం స్థానికంగా ఎంతో మంది నేతలు పోటీ పడినా కాదని మరీ మృణాళిని కుమారుడు కిమిడి నాగార్జునకు సీటు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో నాగార్జున మంత్రి బొత్స సత్యనారాయణ చేతిలో ఓడిపోగా… ఆ తర్వాత చాలా జూనియర్ అయిన నాగార్జునకు ఏకంగా విజయనగరం పార్లమెంటరీ పార్టీ పగ్గాలు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు.
కుమారుడిని ప్రమోట్ చేసుకునేందుకు…..
పదవులు ఇవ్వడాన్ని బట్టి చూస్తేనే కళా వెంకట్రావు ఫ్యామిలీని చంద్రబాబు ఎంత నెత్తిన పెట్టుకుంటున్నారో తెలుస్తోంది. చంద్రబాబు ఆ ఫ్యామిలీని ఎంత నెత్తిన పెట్టుకున్నా టీడీపీ వాళ్లు మాత్రం కళా వెంకట్రావు వద్దే వద్దంటున్నారు. అసలు కళా అన్న పేరు చెపితేనే సహించడం లేదు. అసలే రాజాం నియోజకవర్గానికి చెందిన కళాను ఎచ్చెర్ల టీడీపీ కేడర్ భరించలేక భరిస్తుంటే ఇప్పుడు కళా తన కుమారుడు రాం మల్లిక్ నాయుడును ఎచ్చెర్లలో ప్రమోట్ చేసుకుంటున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ తమకు పోటీ చేసే అవకాశం లేదని అక్కడ టీడీపీ నాయకులు ఆవేదనతో ఉన్నారు.
వ్యతిరేకిస్తున్న క్యాడర్…..
పార్టీలు మారి వచ్చినా కళా వెంకట్రావును భరించామని.. ఇప్పుడు కళా వారసుడిని కూడా తాము ఎలా ? భరిస్తామని.. కళాను ఎచ్చెర్ల నుంచి సాగనంపాలని వారు పట్టుదలతో ఉన్నారు. ఈ సారి ఎచ్చెర్లలో కళా రాజకీయం అంత వీజీ కాదు. ఎచ్చెర్లలో కళా వారసుడికి సొంత పార్టీ నేతల నుంచే సెగ తగులుతుంటే ఇటు చీపురుపల్లిలో కళా వెంకట్రావు తమ్ముడు తనయుడు నాగార్జునకు కూడా నాన్ లోకల్ సెగ తీవ్రంగా ఉంది. అసలు నాగార్జున తల్లి మృణాళిని గెలిపించే తాము తప్పు చేశామని.. ఇప్పుడు తమకు అవకాశం లేకుండా.. పొరుగు జిల్లాకు చెందిన నాగార్జునకు ఇక్కడ సీటు ఇవ్వడం ఏంటని చీపురుపల్లి టీడీపీ కేడర్ గుర్రుగా ఉంది. అలాంటి నాగార్జునను బాబు మరింత అందలం ఎక్కిస్తూ ఏకంగా విజయనగరం జిల్లాలో సీనియర్లను కాదని.. ఆయనకు పార్టీ పార్లమెంటరీ పార్టీ పగ్గాలు ఇచ్చారు. దీంతో అక్కడ మరింత మంట పెట్టినట్లయ్యింది. ఏదేమైనా కళా వెంకట్రావు ఫ్యామిలీ వారసులకు రెండు నియోజకవర్గాల్లోనూ సొంత పార్టీలోనే సెగ తప్పట్లేదు.