పుత్ర ప్రేమ ఎంత పనిచేసింది?
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావుకు భవిష్యత్ పై బెంగ పట్టుకుంది. తన వారసుడికి రాజకీయాలను అప్పగించాలనుకున్న ఆయనకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. కళా వెంకట్రావు [more]
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావుకు భవిష్యత్ పై బెంగ పట్టుకుంది. తన వారసుడికి రాజకీయాలను అప్పగించాలనుకున్న ఆయనకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. కళా వెంకట్రావు [more]
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావుకు భవిష్యత్ పై బెంగ పట్టుకుంది. తన వారసుడికి రాజకీయాలను అప్పగించాలనుకున్న ఆయనకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. కళా వెంకట్రావు గతంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే ప్రస్తుతం ఆయన కేవలం ఎచ్చర్ల నియోజకవర్గానికే పరిమితమయ్యారు. తాను చేేసిన రాజకీయాలే కళా వెంకట్రావుకు శాపంగా మారాయన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.
రాజాంలో పట్టున్నా…..
కళా వెంకట్రావుకు రాజాం నియోజకవర్గంలో పట్టుంది. ఆయన ఆ నియోజకవర్గం కూడా తన కనుసన్నల్లోనే జరగాలని భావించారు. గతంలో ఇక్కడ పోటీ చేసిన టీడీపీ నేతలకు కూడా కళా వెంకట్రావు సహకరించలేదు. దీంతో వరసగా రాజాం నియోజకవర్గంలో వరస ఓటములు తప్పలేదు. 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించలేదు. దీనికి కారణం కళా వెంకట్రావు వైఖరేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
ఎచ్చర్లలోనే మకాం….
ఇక ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించిన ఎచ్చర్ల నియోజకవర్గంలో పెద్దగా దృష్టి పెట్టేవారు కాదు. అంతా రాజాం మీదే కళా వెకట్రావు కన్ను ఉండేది. కానీ ఎచ్చర్లలోనూ సొంత పార్టీలో కళా వెంకట్రావుకు పోటీ వర్గం తయారయింది. దీంతో కళా వెంకట్రావు రాజాం ను వదిలేసి ఎచ్చర్లలోనే మకాం వేయాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడిని పోటీ చేయించాలని భావిస్తున్నారు.
కుమారుడి కోసమే…?
అందుకోసమే కళా వెంకట్రావు ఎచ్చర్ల నియోజకవర్గంలో తనను వ్యతిరేకిస్తున్న నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు. తనపై స్థానికేతరుడిగా ముద్రవేయడం ఒక కారణంకాగా, వచ్చే ఎన్నికల్లో తనకు ఇబ్బంది కాకూడదనే టీడీపీ కీలక నేతలను కూడా పార్టీ నుంచి పంపించి వేస్తున్నారు. తన కుమారుడు రామ్ మల్లిక్ నాయుడును ఫోకస్ చేయడం కోసం పేరున్న నేతలను బయటకు పంపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. కళా వెంకట్రావు లోకేష్ కు ఆప్తుడు కావడంతో పార్టీ కూడా ఇక్కడి విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదు.