కళా కాంతులు లేకుండా చేశారా ?
రాజకీయాలే అంతేననుకోవాలి. ఒకరు ఎదుగుతుంటే మరొకరు దిగలాగుతారు. వారు అడ్డు వస్తున్నారనుకుంటే అడ్డంగా నరికేస్తారు. ఇక్కడ జాలీ, దయ వంటివి ఉండవు. అందుకే రాజకీయాల కంటే కఠినమైనవి [more]
రాజకీయాలే అంతేననుకోవాలి. ఒకరు ఎదుగుతుంటే మరొకరు దిగలాగుతారు. వారు అడ్డు వస్తున్నారనుకుంటే అడ్డంగా నరికేస్తారు. ఇక్కడ జాలీ, దయ వంటివి ఉండవు. అందుకే రాజకీయాల కంటే కఠినమైనవి [more]
రాజకీయాలే అంతేననుకోవాలి. ఒకరు ఎదుగుతుంటే మరొకరు దిగలాగుతారు. వారు అడ్డు వస్తున్నారనుకుంటే అడ్డంగా నరికేస్తారు. ఇక్కడ జాలీ, దయ వంటివి ఉండవు. అందుకే రాజకీయాల కంటే కఠినమైనవి ఏవీలేవని అంటారు. విషయానికి వస్తే శ్రీకాకుళానికి చెందిన పసుపు పార్టీ పెద్దలిద్దరి మధ్య ముదిరిన వివాదాలు ఇపుడు రచ్చగా మారాయట. అందులో ఒకరు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు అయితే. మరొకరు మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అంటున్నారు. అచ్చెన్న బాబు దగ్గర అచ్చా అనిపించుకోవడం కళా వర్గానికి అసలు గిట్టటం లేదుట. దానికి తోడు ఆయన ఏకంగా తన పదవికే ఎసరు పెట్టే స్థాయిలో దూసుకురావడంతో కళా వెంకట్రావుకు ఎక్కడలేని అభద్రతాభావం పట్టుకుందని అంటున్నారు.
లీక్ చేశారా…?
ఓ వైపు ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్న ఇరుక్కుని నానా అవస్థలు పడుతున్నారు. ఆయన మీద జగన్ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. మాజీ మంత్రి వేయి కోట్ల కుంభకోణానికి సూత్రధారి అని కూడా అంటోంది. ఆయన్ని అరెస్ట్ చేస్తామని గట్టి ప్రకటనలే చేస్తోంది. అయితే అచ్చెన్న ఇలా అడ్డంగా ఇరుక్కుపోవడం కళా వెంకట్రావుకు మహదానందంగా ఉందని ప్రచారం సాగుతోంది. ఆయన మీద మరిన్ని లీకులను కూడా కళా వెంకట్రావు వర్గం ఈ సందర్భంగా విడుదల చేస్తూ ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నించిందట. ఆ విధంగా పెదబాబు, చినబాబులకు అచ్చెన్నను దూరం చేయడానికి కూడా కళా వర్గం చురుకుగా పావులు కదిపినట్లుగా చెబుతున్నారు. ఈ కుంభకోణం వెనక కావాలనే లోకేష్ పేరుని ప్రస్థావించడం వెనక కళా వర్గం హ్యాండ్ ఉందని అంటున్నారు.
అదీ కధ…..
సిక్కోలు రాజకీయాల్లో మొదటి నుంచి కింజరపు కుటుంబానికి, కళా వెంకట్రావు వర్గానికి పడదు, ఇద్దరూ ఒకేసారి టీడీపీలో ప్రవేశించారు. అయితే ఎర్రన్నాయుడు సూపర్ ఫాస్ట్ గా ఎదిగి కేంద్ర మంత్రిగా ఢిల్లీ వరకూ ఎగబాకారు. ఆయన బతికి ఉన్నన్నాళ్ళూ కళా వెంకట్రావు వర్గానికి పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఇక ఆయన మరణాంతరం తమ్ముడు అచ్చెన్నాయుడు అన్న గారి మాదిరిగానే జిల్లా రాజకీయాలను శాసించడమే కాదు, జగన్ సునామీలో సైతం నిన్నటి ఎన్నికల్లో గెలిచి బాబుకు కుడిభుజమైపోయారు. ఆయన నోరు ధాటిని మెచ్చి బాబు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ చేస్తారని వార్తలు వస్తున్న క్రమంలో తన రాజకీయ కళ పూర్తిగా మసకబారుతోందని గ్రహించిన కళా వెంకట్రావు వర్గం ఈ ఎస్ఐ స్కాంని ఉపయోగించుకుంటోందని అంటున్నారు.
ఫిర్యాదులట….
అచ్చెన్నపైన బురద జల్లడం వెనక కళా వెంకట్రావు వర్గం ఉందని మాజీ మంత్రి వర్గీయులు గట్టిగా అనుమానిస్తున్నారు. చినబాబు లోకేష్ చెబితేనే లేఖ రాశాను అని అచ్చెన్న అన్నారంటూ వార్తలు లీక్ చేయడాన్ని తప్పుపడుతున్నారు. ఆ విధంగా హైకమాండ్ తో చెడగొట్టి పబ్బం గడుపుకుందామని చూస్తున్నారని అంటున్నారు. ఇపుడు జరిగిన బాగోతం తరువాత కచ్చితంగా అచ్చెన్నను పక్కన పెడతారని, ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవి ఆయనకు దక్కదని కూడా కళా వెంకట్రావు వర్గం అంచనా వేయడమే కాదు ఆనందిస్తోంది. ఇక కళా వెంకట్రావు వర్గానికి చెందిన వారంతా ఈ విషయంలో అచ్చెన్నకు మద్దతు ఇవ్వకుండా సైలెంట్ కావడం వెనక కూడా గ్రూప్ రాజకీయాలు ఉన్నాయని అంటున్నారు. దీని మీద హైకమాండ్ కి ఫిర్యాదులు చేసేందుకు అచ్చెన్న వర్గం రెడీ అవుతోందిట. మొత్తానికి పార్టీ పరాజయమైనా కూడా తమ్ముళ్ళ కీచులాటలు మాత్రం ఎక్కడా తగ్గలేదని అంటున్నారు