ఏందో ఈయన.. వయసు మీరితే అంతేనేమో?
రాజకీయాల్లో అంతేనేమో. ఒక దీపం మలిగితేనే మరో దీపం వెలుగుతుంది. ఒకేసారి అన్ని దీపాలు వెలిగితే చూడాలని అధినాయకుడు అనుకుంటాడు కానీ జరిగేది వేరు కదా. ఇపుడు [more]
రాజకీయాల్లో అంతేనేమో. ఒక దీపం మలిగితేనే మరో దీపం వెలుగుతుంది. ఒకేసారి అన్ని దీపాలు వెలిగితే చూడాలని అధినాయకుడు అనుకుంటాడు కానీ జరిగేది వేరు కదా. ఇపుడు [more]
రాజకీయాల్లో అంతేనేమో. ఒక దీపం మలిగితేనే మరో దీపం వెలుగుతుంది. ఒకేసారి అన్ని దీపాలు వెలిగితే చూడాలని అధినాయకుడు అనుకుంటాడు కానీ జరిగేది వేరు కదా. ఇపుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన పెద్ద దిక్కు, బీసీ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్ట్ కావడం పట్ల చంద్రబాబు విలవిల్లాడారు. పోరాడుతున్నారు. సరే అచ్చెన్న అరెస్ట్ ఎన్ని మలుపులు తిరుగుతుందో ఎవరికీ తెలియదు కానీ సిక్కోలులో సీనియర్ నేత, ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కళా వెంకటరావు ఇపుడు జూలు విదిల్చారు. ఆయన ఎక్కువగానే సద్దు చేస్తున్నారు.
నైతిక విజయమట….
విజయాలే రాజకీయాల్లో ఉంటాయి. అలాగే హత్యలు ఉండవు, అన్నీ ఆత్మహత్యలే ఉంటాయి. ఇది రాసిపెట్టుకోవాల్సిన మేలి మాటలు, కానీ ఓడిన వారంతా నైతిక విజయం అంటూ తమను తాము మభ్యపెట్టుకుంటూ ఇతరులను మభ్యపెడతారు. నిజానికి రాజ్యసభ ఎన్నికల్లో అంత తక్కువ ఓట్లు వచ్చిన తరువాత చంద్రబాబే ఏం మాట్లాడలేకపోతున్నారు. కానీ ఆరోవేలు లాంటి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ మాత్రం ఇది పార్టీకి నైతిక విజయం అంటూ కళా వెంకటరావు గొంతు చేస్తున్నారు. మేము ఓడినా గెలిచాం అంటున్నారు. సరే అలాగే అనుకున్నా కేవలం పదిహేడు ఓట్లు మాత్రమే వచ్చి సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఓటేయలేకపోయాక ఇంక నైతికత కధ ఏముందో కళా వెంకటరావు చెప్పాలి.
హైలెట్ అవుదామనా …?
ఇపుడు సిక్కోలు జిల్లా నుంచి అచ్చెన్న పెద్ద నోరు ఎటూ మూగబోయింది. ఆ ప్లేస్ లో తాను ఉన్నాననిపించుకోవడానికి అన్నట్లుగా కళా హడావుడి చేస్తున్నారని అంటున్నారు. అయితే విమర్శలు చేసినా, సెటైర్లు పేలిచినా గట్టిగా ఉండాలి. కనీసం తన పార్టీ వారు అయినా నమ్మేటట్టు ఉండాలి. కానీ కళా వెంకటరావు అతి ఉత్సాహంతో చేస్తున్న ప్రకటనలు నవ్వులపాలు అవుతున్నాయి. రాజ్యసభ ఎన్నికల గురించి ఎంత తొందరగా మరచిపోతే అంత మంచిదని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. దాన్ని ఇంకా రచ్చ చేసి పార్టీకే మరిన్ని కొత్త రాళ్ళు వేయించేలా కళా రాజకీయం సాగుతోంది అంటున్నారు.
అదా సంగతి…..
జిల్లాలో చూసుకుంటే కళా వెంకటరావుకు, అచ్చెన్నకు పడదని అంటారు. ఎక్కడ అచ్చెన్నకు ఏపీ తెలుగుదేశం పీఠం దక్కుతుందో అని కళా వర్గం కిందా మీదా అయింది. ఇపుడు అచ్చెన్న అరెస్ట్ తరువాత ఆ ఊసు ఉండదని నిర్ధారణకు వచ్చిన తరువాతనే పార్టీలోని వైరి వర్గాల్లో కళాకాంతులు కనిపిస్తున్నాయి అంటున్నారు. తనకు కాకపోయినా ఫరవాలేదు, తన వారికైనా ఏపీ టీడీపీ పీఠం దక్కితే అదే పదివేలు అని కళా అనుకుంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. మరి చూడాలి కళా వెంకటరావు రాజకీయం ఎంతవరకూ ఫలిస్తుందో.