కాల్వ కూడా జంప్ అయ్యేటట్లుందే? టీడీపీలో హై అలెర్ట్
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ ఆకర్ష్ మంత్రం బాగా పనిచేస్తోంది. టీడీపీని కూకటి వేళ్లతో పెకలించి వేసేందుకు అధికార పార్టీ వైసీపీ దూకుడు మరింతగా పెంచింది. పార్టీకి [more]
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ ఆకర్ష్ మంత్రం బాగా పనిచేస్తోంది. టీడీపీని కూకటి వేళ్లతో పెకలించి వేసేందుకు అధికార పార్టీ వైసీపీ దూకుడు మరింతగా పెంచింది. పార్టీకి [more]
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ ఆకర్ష్ మంత్రం బాగా పనిచేస్తోంది. టీడీపీని కూకటి వేళ్లతో పెకలించి వేసేందుకు అధికార పార్టీ వైసీపీ దూకుడు మరింతగా పెంచింది. పార్టీకి బలమైన పునాదులని చంద్రబాబు ఎవరినైతే భావిస్తున్నారో.. వారిని తన పార్టీలోకి చేర్చుకునే ప్రక్రియకు జగన్ శ్రీకారం చుట్టారు. దీనిని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గడిచిన పదిహేను రోజులుగా అనేక మంది నాయకులు వచ్చి పార్టీలో చేరిపోయారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అదికూడా పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకులు కూడా టీడీపీకి ఝలక్ ఇస్తున్నారు. దీంతో చాలా మేరకు జిల్లాల్లో పార్టీ పరిస్థితి దారుణంగా పడిపోయింది. అయితే, ఇప్పుడు అనంతపురంపై దృష్టి పెట్టిన వైసీపీ తన యాక్షన్‌ను మరింత తీవ్రతరం చేయాలని భావిస్తోంది.
కాల్వను లాగేయాలని….
ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నాయకురాలు, ఆ పార్టీకి పూర్తి విధేయ కుటుంబంగా ఉన్న మాజీ మంత్రి, ఎమ్మెల్సీ శమంతకమణి సహా ఆమె కుమార్తె మాజీ విప్ యామినీ బాలలను పార్టీలో కి చేర్చుకుని టీడీపీకి భారీ దెబ్బకొట్టారు. ఇంతటితో అనంతపురం ఆకర్ష్ ప్రయోగం ఆగిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ, ఇప్పుడు అసలు యాక్షన్ ప్రారంభమైందని అంటున్నారు వైసీపీ సీనియర్లు. తాజాగా అందిన సమాచారం ప్రకారం అనంతపురం జిల్లా రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, చంద్రబాబుకు రైట్ హ్యాండ్‌గా గత ప్రభుత్వంలో వ్యవహరించిన మాజీ జర్నలిస్టు కాల్వ శ్రీనివాసులుకు కూడా వైసీపీ గేలం వేసింది. ఈయనతో చర్చించేందుకు ఏకంగా మంత్రి ఒకరు రంగంలోకి దిగారని అంటున్నారు.
రంగంలోకి మంత్రి…..
ఆయన పార్టీలోకి వస్తే.. నామినేటెడ్ పదవుల్లో కీలకమైన దానిని ఇవ్వడంతోపాటు.. పార్టీలోనూ పదవిని ఇచ్చేందుకు జగన్ ఉత్సాహం చూపుతున్నారని అంటున్నారు. కాల్వ శ్రీనివాస్ రావడం ద్వారా అనంత టీడీపీని పూర్తిగా తుడిచి పెట్టేయొచ్చని భావిస్తున్నా రు. కాల్వ శ్రీనివాస్ బీసీల్లో బలమైన బోయ సామాజిక వర్గానికి చెందిన వారు. మరపక్క, పరిటాల వర్గాన్ని కూడా దెబ్బకొట్టే ఛాన్స్ ఉంటుందని వైసీపీలో చర్చ సాగుతోంది. ప్రస్తుతం కాల్వ శ్రీనివాస్ తో వైసీపీ నేతలు చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయం బయటకు పొక్కగానే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అలెర్ట్ అయినట్టు సమాచారం. వెంటనే పార్టీలో నెంబర్ 2 అయిన యనమల రామకృష్ణుడును రంగంలోకి దింపారని తెలిసింది.
చంద్రబాబు ఫోన్ చేసినా….
ఇదే విషయంపై ప్రస్తుతం యనమల కూడా కాల్వ శ్రీనివాస్ తో చర్చించేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ వర్గాలు కూడా చెబుతున్నా యి. వాస్తవానికి మంగళవారమే చంద్రబాబు ఆయనకు కబురు పెట్టారని, విజయవాడ వచ్చి పార్టీ కార్యాలయంలో తనను కలవాలని కోరినా కాల్వ శ్రీనివాస్ రాకపోవడం, వైసీపీ నేతలు చర్చలు జరుపుతుండడం, తాజాగా శమంతకమణి ఫిరాయించడం వంటి పరిణామాల నేపథ్యంలో టీడీపీ అలెర్ట్ అయింది. అయితే, కాల్వ శ్రీనివాస్ ఎటు మొగ్గుతారు? అనేది చూడాలి. కాగా, ఇటీవల చంద్రబాబు ఇచ్చిన పిలుపులో భాగంగా ప్రభుత్వంపై అనేక విమర్శలు చేయడంతోపాటు, ఉద్యమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు.