మేకప్ వేసుకున్నంత ఈజీ కాదు పాలిటిక్స్ లో పికప్ అవ్వడానికి?
సినీ గ్లామర్ కు ఇప్పుడు రాజకీయాల్లో చోటు లేదని తెలిసిపోయింది. తమ సభల్లో మార్మోగిన చప్పట్లు, ఈలలు ఆ గ్రౌండ్ కే పరిమితమనవి, అవి పోలింగ్ కేంద్రం [more]
సినీ గ్లామర్ కు ఇప్పుడు రాజకీయాల్లో చోటు లేదని తెలిసిపోయింది. తమ సభల్లో మార్మోగిన చప్పట్లు, ఈలలు ఆ గ్రౌండ్ కే పరిమితమనవి, అవి పోలింగ్ కేంద్రం [more]
సినీ గ్లామర్ కు ఇప్పుడు రాజకీయాల్లో చోటు లేదని తెలిసిపోయింది. తమ సభల్లో మార్మోగిన చప్పట్లు, ఈలలు ఆ గ్రౌండ్ కే పరిమితమనవి, అవి పోలింగ్ కేంద్రం వరకూ రావని మరోసారి స్పష్టమయింది. తమిళనాడులో కమల్ హాసన్ పార్టీ జీరో రిజల్ట్ సాధించడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కనీసం కమల్ హాసన్ కూడా తాను పోటీ చేసే స్థానంలో గెలవకపోవడం సినీ హీరోలపై ప్రజల నమ్మకాన్ని చెప్పకనే చెబుతోంది.
విలక్షణ నటుడిగా…
కమల్ హాసన్ సామన్యుడేమీ కాదు. విలక్షణ నటుడు ఆయన. దేశ వ్యాప్తంగా అభిమానులున్నారు. ఇక తమిళనాడులో ఆయన అభిమానులకు కొదవేమీ లేదు. రజనీకాంత్ రాజకీయాల నుంచి వెనకడుగు వేసినా కమల్ హాసన్ ధైర్యంతో ముందుకు సాగారు. బీజేపీని లక్ష్యంగా చేసుకున్నారు. తమిళనాడులోని డీఎంకే, అన్నాడీఎంకేకు తానే ప్రత్యామ్నాయం అని చాటి చెప్పారు. తృతీయ కూటమిని ఏర్పాటు చేసిన తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా మారతారని కమల్ హాసన్ భావించారు.
ఒక్క స్థానంలోనూ….
మక్కల్ నీది మయ్యమ్ పార్టీని స్థాపించన కమల్ హాసన్ కొంత దూకుడుగానే వ్యవహరించారు. మక్కల్ నీది మయ్యమ్ 142 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. ఒక్క చోట కూడా విజయం సాధించలేదు. కనీసం తాను పోటీ చేసిన కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి కూడా ఆయన గెలుపొందలేకపోయారు. బీజేపీ అభ్యర్థి వాసతి శ్రీనివాసన్ చేతిలో 1500 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
సినీ గ్లామర్ కు…..
సినీ హీరోలను తిరస్కరించడం రాజకీయాల్లో కొత్తేమీ కాదు. వారిని వెండితెరకే పరిమితం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కల్యాణ్ సయితం తాను పోట ీచేసిన రెండు స్థానాల్లోనూ పరాజయం పాలయ్యారు. కమల్ హాసన్ తనపై నమ్మకంతో, అభిమానంతో జనం ఓట్లు వేస్తారని భావించారు. అందుకే తాను చేపల పులుసు ఇవ్వనని, చేపల పట్టేందుకు వలలు మాత్రమే ఇస్తానని ప్రచారం చేశారు. అయినా తమిళ ప్రజలు కమల్ హాసన్ ను తిరస్కరించారు. రాజకీయాల్లో సినీ గ్లామర్ కు కాలం చెల్లిపోయిందని, ఎమ్జీఆర్, జయలలిత, ఎన్టీఆర్ తోనే ఆ రాజకీయాలు ముగిశాయని చెప్పవచ్చు.