ఆ ఆశతోనే ఇంకా ఉన్నారా?
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఆశలు చిగురిస్తున్నాయా? తిరిగి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా? అంటే అవుననే అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్. మధ్యప్రదేశ్ లో [more]
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఆశలు చిగురిస్తున్నాయా? తిరిగి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా? అంటే అవుననే అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్. మధ్యప్రదేశ్ లో [more]
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఆశలు చిగురిస్తున్నాయా? తిరిగి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా? అంటే అవుననే అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్. మధ్యప్రదేశ్ లో జరిగే ఉప ఎన్నికల్లో తమదే విజయం అని, తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కమల్ నాధ్ ఖచ్చితంగా చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిపోయి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా సయితం తమదే విజయమని ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.
త్వరలోనే ఉప ఎన్నికలు….
మధ్యప్రదేశ్ లో త్వరలోనే మినీ సమరం జరగనుంది. నిజంగా ఈ ఎన్నికలు ఎవరిని అధికారంలో ఉంచాలో నిర్ణయిస్తాయి. మధ్యప్రదేశ్ లో 27 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. బీహార్ ఎన్నికలతో పాటు వీటికి కూడా ఒకేసారి షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశముందని ఎన్నికల కమిషన్ వర్గాలు వెల్లడించాయి. 27 శాసనసభ నియోజకవర్గాల్లో గెలుపోటములు ప్రస్తుత ముఖ్మమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భవితవ్యాన్ని నిర్దేశిస్తాయి.
27 స్థానాలకు ఉప ఎన్నికలు….
మధ్యప్రదేశ్ లో మొన్నటి వరకూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండేది. కానీ కమల్ నాధ్ తో విభేదించిన జ్యోతిరాదిత్య సింధియా తన వర్గానికి చెందిన 19 మంది సభ్యులతో కలసి బయటకు వెళ్లిపోయారు. వారంతా రాజీనామాలు చేశారు. ఈ 19 మందికి చెందిన నియోజకవర్గాలతో పాటు మరో ఎనిమిది నియోజకవర్గాలు వివిధ కారణాలతో ఖాళీ అయ్యాయి. మొత్తం 27 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనుండటంతో ఇప్పటికే రెండు పార్టీలూ ఎన్నికల ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రారంభించాయి.
అత్యధికం కాంగ్రెస్ వే కావడంతో….
జరనున్న 27 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ వే కావడం విశేషం. దీంతో కాంగ్రెస్ కు నమ్మకం ఏర్పడింది. ప్రజా తీర్పును కాదని వెళ్లిన వారిని మరోసారి ప్రజలు ఆదరించరన్న నమ్మకంతో కమల్ నాధ్ ఉన్నారు. అందుకే ఈ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను దించేందుకు కమల్ నాధ్ రెడీ అయ్యారు. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా సర్వే కూడా చేయించినట్లు తెలిసింది. ఈ స్థానాల్లో కనీసం పదిహేను స్థానాలను దక్కించుకుంటే కమల్ నాధ్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే కమల్ నాధ్ ఉప ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు.