ఇక గంటలే సమయం… కూలిపోక తప్పదా?
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాధ్ కు అన్ని దారులు మూసుకుపోయాయి. రేపు బలపరీక్షను నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పుతో కమల్ నాధ్ ఇక తప్పనిసరిగా బలపరీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి [more]
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాధ్ కు అన్ని దారులు మూసుకుపోయాయి. రేపు బలపరీక్షను నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పుతో కమల్ నాధ్ ఇక తప్పనిసరిగా బలపరీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి [more]
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాధ్ కు అన్ని దారులు మూసుకుపోయాయి. రేపు బలపరీక్షను నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పుతో కమల్ నాధ్ ఇక తప్పనిసరిగా బలపరీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జ్యోతిరాదిత్య సింధియా వర్గం ఎమ్మెల్యేలు 22 మంది రాజీనామా చేయడంతో కమల్ నాధ్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. గత పదిహేను రోజుల నుంచి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అసంతృప్త ఎమ్మెల్యేలంతా బెంగళూరులోనే మకాం వేసి ఉన్నారు.
సుప్రీంకోర్టు సూచనలివే…
కాగా సుప్రీంకోర్టు తాజాగా రేపు బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. రేపు సాయంత్రం ఐదుగంటల్లోగా బలపరీక్షను పూర్తి చేయాలని కోరింది. ఈ మొత్పం ప్రక్రియను వీడియో ద్వారా చిత్రీకరించాలని ఆదేశించింది. అంతేకాకుండా చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్ జరపాలని సుప్రీంకోర్టు సూచనలు కూడా చేసింది. బీజేపీ నేతలు బలపరీక్ష వెంటనే నిర్వహించాలని సుప్రీంకోర్టుకు వెళ్లడంతో కమల్ నాధ్ అక్కడ చుక్కెదురయింది.
అసంతృప్త ఎమ్మెల్యేలు…..
గత కొంతకాలంగా కమల్ నాధ్ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు తమ దారి తాము చూసుకున్నారు. వారంతా తమ పదవులకు రాజీనామాలు చేశారు. అయితే స్పీకర్ వాటిని ఆమోదించలేదు. తన ఎదుట హాజరై రాజీనామాలకు గల కారణాలు తెలపాలని స్పీకర్ ప్రజాపతి కోరినా వారు హాజరు కాలేదు. దీంతో వారి రాజీనామాలు ఆమోదించని ప్రజాపతి ఇటీవల అసెంబ్లీ సమావేశాలను ఒక్కరోజు జరిపి వాయిదా వేశారు. దీంతో బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
బలం లేదని….
నిజానికి కమల్ నాధ్ ప్రభుత్వానికి బలం లేదు. 22 మంది ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకున్నా, హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినా కమల్ నాధ్ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు విప్ లు జారీ చేశాయి. కాంగ్రెస్ ప్రస్తుత బలం 98గా ఉండగా, బీజేపీ 107 మంది సభ్యులతో మెజారిటీ కలిగి ఉంది. దీంతో కమల్ నాధ్ బలపరీక్షకు ముందుగానే రాజీనామా చేస్తారా? లేక బలపరీక్షకు సిద్ధమవుతారా? అన్నది చూడాలి.