మొత్తానికి ముంచేసింది ముసిలోళ్లు ఇద్దరే
మధ్యప్రదేశ్ రాజకీయాలను ముంచేసింది వారిద్దరే. పేరుకు సీనియర్ నేతలు. రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చినా ఇంకా పదవులపై ఆశ చావక పార్టీని భ్రష్టు పట్టించారు. వారే [more]
మధ్యప్రదేశ్ రాజకీయాలను ముంచేసింది వారిద్దరే. పేరుకు సీనియర్ నేతలు. రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చినా ఇంకా పదవులపై ఆశ చావక పార్టీని భ్రష్టు పట్టించారు. వారే [more]
మధ్యప్రదేశ్ రాజకీయాలను ముంచేసింది వారిద్దరే. పేరుకు సీనియర్ నేతలు. రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చినా ఇంకా పదవులపై ఆశ చావక పార్టీని భ్రష్టు పట్టించారు. వారే పార్టీ సీనియర్ నేతలు కలమ్ నాధ్, దిగ్విజయ్ సింగ్. వీరిద్దరి కారణంగానే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కష్టాలు కొని తెచ్చుకుంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు కొదవలేదు. వారు అధికారంలో ఉంటేనే కనపడతారు. లేకుంటే ప్రజల వైపు తొంగి చూడరు. పార్టీ కోసం పనిచేయరు.
కేంద్ర మంత్రిగా అప్పుడు….
కమల్ నాధ్ గతంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా కేంద్రమంత్రిగా పనిచేశారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో లేకపోవడంతో కేంద్రంలో పవర్ లో ఉండటంతో కమల్ నాధ్ పదేళ్ల పాటు ఢిల్లీలోనే మకాం వేశారు. అప్పుడప్పుడు మధ్యప్రదేశ్ వచ్చినా పార్టీపై తన పట్టుకోల్పోకుండా జాగ్రత్త పడేవారు. సోనియా గాంధీకి అత్యంత నమ్మకస్థుడిగా పేరున్న కమల్ నాధ్ మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి అయ్యారు. సోనియా ఆశీస్సులతోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు.
ఢిల్లీలోనే ఎక్కువగా…..
ఇక దిగ్విజయ్ సింగ్ కూడా అంతే. ఎప్పుడో మధ్యప్రదేశ్ ను పాలించిన దిగ్విజయ్ సింగ్ తన పాలన తర్వాత పదిహేనేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడానికి కారణంగా చెబుతారు. ఈయన కూడా ఢిల్లీ రాజకీయాలపైనే ఎక్కువ ఆసక్తి చూపుతారు. దాదాపు పదిహేనేళ్ల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండిపోయారు. ఎన్నికలకు ముందు మాత్రం దిగ్విజయ్ సింగ్ పాదయాత్ర చేశారు. కొంత మేర పరవాలేదనిపించినా ఈయన అవుట్ డేటెట్ నేతగా ముద్రపడిపోయారు. కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ లో అధికారంలోకి రాగానే అప్పటి వరకూ పనిచేసిన సింధియాను తొక్కేయడానికి ఇద్దరూ ఒకటయ్యారు. మంత్రుల శాఖల విషయంలోనూ వీరి మాటే చెల్లింది. కనీసం సింధియాను సంప్రదించే పని కూడా చేయలేదు.
సింధియాను తొక్కేసేందుకే?
ఇక మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవిపై జ్యోతిరాదిత్య సింధియా పేరును ఖరారు చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావించినా వీరిద్దరే అడ్డుపడ్డారు. గత నాలుగు నెలల నుంచి సింధియా అన్యమనస్కంగానే ఉంటున్నారు. పార్టీపై అప్పుడడప్పుడూ ఆరోపణలు చేస్తున్నారు. అయినా అధిష్టానం ఏమాత్రం పట్టించుకోలేదు. వీరిద్దరూ సింధియాను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పేశారు. దీంతో పార్టీ కూడా సింధియాను దూరంగా ఉంచింది. ఫలితంగానే జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడారు. ఈ ఇద్దరి నిర్వాకం వల్లనే పార్టీ అధికారాన్ని కోల్పోవాల్సి వస్తోంది.