ఇక వారికి ముఖ్యమంత్రి పీఠం దక్కదా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1953 లో ఏర్పడింది. నాటి నుంచి నేటి వరకూ చూసుకుంటే కొన్ని ప్రధాన సామాజిక వర్గాల నేతలు ఏపీకి సీఎంలుగా పనిచేశారు. అందులో బ్రాహ్మణులు, [more]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1953 లో ఏర్పడింది. నాటి నుంచి నేటి వరకూ చూసుకుంటే కొన్ని ప్రధాన సామాజిక వర్గాల నేతలు ఏపీకి సీఎంలుగా పనిచేశారు. అందులో బ్రాహ్మణులు, [more]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1953 లో ఏర్పడింది. నాటి నుంచి నేటి వరకూ చూసుకుంటే కొన్ని ప్రధాన సామాజిక వర్గాల నేతలు ఏపీకి సీఎంలుగా పనిచేశారు. అందులో బ్రాహ్మణులు, దళితులు, వెలమలు, వైశ్యులు ఉన్నారు. ఇక అత్యధిక కాలం ఈ రాష్ట్రాన్ని పాలించింది రెడ్లు, కమ్మలు. చిత్రమేంటంటే మంత్రులుగా పనిచేసి కీలకమైన శాఖలు చూసిన రాజులు, కాపులకు మాత్రం ముఖ్యమంత్రి పీఠం దక్కలేదు. క్షత్రియులు జనాభా పరంగా పరిమితం కాబట్టి సరిపెట్టుకున్నా కాపులు మాత్రం అత్యధిక జనాభాగా ఉన్నారు. మరి ఎందరికో దక్కిన సీఎం పోస్ట్ కాపులకు దక్కకపోవడమేంటి అన్నదే వారి భాధ, ఆవేదన.
కాపు కాసేందుకే ….
భారతీయ జనతా పార్టీ ఇపుడు చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తాను అంటోంది. మీ కులానికి ఉన్న అసంతృప్తిని పొగొడుతాను అంటోంది. కాపులకు పెద్ద కుర్చీ అప్పగిస్తాను అని కూడా చెబుతోంది. కాపులలో ఉన్న బాధను అర్ధం చేసుకున్న బీజేపీ వారిని తమ వైపు తిప్పుకోవాలనుకుంటోంది. ఫలితంగా ఏపీ బీజేపీలో పెను మార్పులు వచ్చేశాయి. మొదట్లో బ్రాహ్మణులు, వైశ్యులు, కాపుల పార్టీగా ఉన్న బీజేపీ వెంకయ్యనాయుడు, హరిబాబు వంటి వారి హయాంలో కమ్మల ఆధిపత్యం గల పార్టీగా మారిపోయింది. ఓ విధంగా చెప్పాలంటే తెలుగుదేశానికి బీ టీంగా మారింది. దాంతో కాపులు ఎక్కడ చూసినా ద్వితీయ శ్రేణి పౌరులే అయ్యారు. ఇపుడు బీజేపీ మాత్రం ఇది మీ పార్టీయే అనుకోమంటోంది.
చెడినది ఎవరో …
ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. ప్రధానంగా నాయకత్వ సమస్య ఉంది. దాంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వారికి ఇప్పటిదాకా ఆశాకిరణంగా బీజేపీ కనిపించింది. ఇపుడు బీజేపీ కాపుల పార్టీగా అవతరించాలనుకుంటోంది. దాంతో కమ్మలకు పెద్ద చిక్కు వచ్చిపడుతోంది. టీడీపీ రోజురోజుకూ దిగజారుతోంది. బీజేపీలో పనిచేయలంటే కాపుల ఆధిపత్యం కిందనేనా అన్న అనుమానాలు వారికి కలుగుతున్నాయట. బీజేపీ తీసుకున్న ఈ సామాజికపరమైన నిర్ణయంతో కమ్మలే ఎక్కువగా నష్టపోతున్నారని చెప్పాలి.
ఆగినట్లేగా …?
1983 వరకూ ఏపీ రాజకీయం చూసుకుంటే కేవలం ముఖ్యమంత్రి సీటు కోసమే కాంగ్రెస్ నుంచి కమ్మ సామాజికవర్గం నేత నాదెండ్ల భాస్కరరావు బయటకు వచ్చారని చెబుతారు. అపుడు కూడా మెజారిటీ పదవులు అన్నీ రెడ్లు తీసుకునేవారు, ముఖ్యమంత్రులు వారే. వరసగా 1978 నుంచి తీసుకుంటే నలుగురు సీఎంలు మారినా కూడా అందరూ రెడ్డి సామాజికవర్గం వారే కావడంతోనే విరక్తి చెంది ఆయన పార్టీ పెట్టాలనుకున్నారని చెబుతారు. ఇక ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీని ప్రారంభించడంతో అందులో కో పైలెట్ గా చేరిన భాస్కర రావు ఎట్టకేలకు నెలరాజుగా తన సీఎం కోరిక తీర్చుకోగలిగారు. ఇక టీడీపీ వచ్చాక ముగ్గురు ముఖ్యమంత్రులు అయితే వారంతా కమ్మలే. ఇపుడు ఏపీలో రెడ్ల హవా మళ్ళీ మొదలైంది. జగన్ సొంత పార్టీ పెట్టడం, యువకుడు కావడంతో వారికో అడ్రెస్ ఏర్పడింది. కాపులకు బీజేపీ తోడుగా ఉంటుంది. ఎటొచ్చి నష్టపోతోంది కమ్మలేనని తాజా రాజకీయ, సామాజిక పరిణామాలు చెబుతున్నాయి. చూడాలి వారు ఏ రకమైన ఎతుగడ వేస్తారో