ఎంత మందికి తగిలించావు తల్లీ…?
బాలీవుడ్ సింగర్ బేబీ డాల్ ఫేమ్ కనికా కపూర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. బాలీవుడ్ సెలబ్రిటీస్ లో తొలి కరోనా పాజిటివ్ కేసుగా [more]
బాలీవుడ్ సింగర్ బేబీ డాల్ ఫేమ్ కనికా కపూర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. బాలీవుడ్ సెలబ్రిటీస్ లో తొలి కరోనా పాజిటివ్ కేసుగా [more]
బాలీవుడ్ సింగర్ బేబీ డాల్ ఫేమ్ కనికా కపూర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. బాలీవుడ్ సెలబ్రిటీస్ లో తొలి కరోనా పాజిటివ్ కేసుగా ఆమె మారడం సంగతి ఎలా ఉన్నా లక్నో లో ఆమె వందమంది ప్రముఖులతో ఒక పార్టీలో సంచరించడమే అందరిలో ఆందోళన కలిగించిన అంశం. పదిరోజుల క్రితం లండన్ నుంచి భారత్ వచ్చిన కనిక కపూర్ కి విమానాశ్రయంలో నిర్వహించిన సాధారణ స్క్రీనింగ్ లో కరోనా బయట పడలేదు.
స్వల్ప జ్వరంగా ఉండటంతో….
అయితే గత నాలుగు రోజులుగా మాత్రం ఆమె స్వల్ప జ్వరం ఫ్లూ లక్షణాలతో బాధపడుతూ పరీక్షలు చేయించుకోవడంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కి పడ్డారు. అంతకుముందు ఆమెను కలిసిన వారిలో ఒకరిద్దరు ఎంపీలు, రాజస్థాన్ మాజీ సిఎం వసుంధర రాజే వంటి ప్రముఖులు ఉండటంతో రాజకీయ వ్యాపార, సినీ వర్గాల్లో కోవిడ్ పై ఆందోళన మొదలైంది.
అంతా స్వచ్ఛందంగా గృహ నిర్బంధం లోకే …
దాంతో సింగర్ కనికా కపూర్ ను కలిసిన వారంతా స్వచ్ఛందంగా గృహ నిర్బంధంలోకి వెళ్ళి వైద్యుల పర్యవేక్షణలో గడుపుతున్నారు. లక్నో లో కనికా కపూర్ పార్టీ లో పాల్గొన్న ప్రముఖులు లిస్ట్ ను ఇప్పుడు యుపి ప్రభుత్వం సంపాదించి ఆయా వ్యక్తులపై పర్యవేక్షణ మొదలు పెట్టింది. కనికా కపూర్ తన ప్రయాణ వివరాలను ప్రభుత్వానికి ఎందుకు అందజేయలేదనే అంశంపై యోగి సర్కార్ సీరియస్ కూడా అయ్యింది.
సోషల్ మీడియాలో….
అయితే అంతా అయిపోయాకా ఇప్పుడు చేసేదేముంది తదుపరి చర్యలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపక్రమించాయి. కనికా కపూర్ ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. కనికా ను కలిసిన వసుంధర రాజే, ఎంపి దుశ్యంత్ వంటివారు పార్టీ తరువాత ఎవరు ఎవర్ని కలిసింది అనే అంశం పై యుపి ప్రభుత్వంతో పాటు కేంద్రం గట్టిగా దృష్టి పెట్టింది. మరోపక్క కనికా కపూర్ త్వరగా కోలుకోవాలంటూ అటు బాలీవుడ్, ఇటు ఆమె అభిమానులు సామాజిక మాధ్యమాల్లో వేలాదిగా సందేశాలు పంపుతున్నారు.