జగన్ ను తగులుకుంటుందందుకేనా?
కాంగ్రెస్ లో పుట్టి పెరిగిన కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో అధ్యక్ష పదవి దక్కనంతవరకూ ఫుల్ సైలెంట్. ఆయన అసలు పార్టీలో ఉన్నారో లేదో కూడా ఎవరికీ తెలియదు. [more]
కాంగ్రెస్ లో పుట్టి పెరిగిన కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో అధ్యక్ష పదవి దక్కనంతవరకూ ఫుల్ సైలెంట్. ఆయన అసలు పార్టీలో ఉన్నారో లేదో కూడా ఎవరికీ తెలియదు. [more]
కాంగ్రెస్ లో పుట్టి పెరిగిన కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో అధ్యక్ష పదవి దక్కనంతవరకూ ఫుల్ సైలెంట్. ఆయన అసలు పార్టీలో ఉన్నారో లేదో కూడా ఎవరికీ తెలియదు. ఓ దశలో వైసీపీలో చేరిపోదామని పెట్టే బేడా సర్దేశాక కమలం పార్టీ కళ్ళెం వేసింది. అంతేనా ఏకంగా ప్రెసిడెంట్ కిరీటాన్ని నెత్తిన పెట్టి మహరాజు నీవేనయ్యా అంటూ గౌరవించేసింది. ఇక నిన్నటి ఎన్నికల్లో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని ఎక్కడ నిలబెట్టారో అందరికీ తెలిసిందే. తనకు పట్టుందని చెప్పుకున్న చోటనే ఆయన ఘోరంగా ఓడిపోయారు. ఎన్నికల ముందు వరకూ జగన్ ని, వైసీపీని పల్లెత్తు మాట అనని కన్నా ఫలితాలు వచ్చాక మాత్రం కన్నా లక్ష్మీనారాయణ బాగానే గర్జిస్తున్నారు.
బాణాలే వేస్తున్నారు…
ఏపీలో వైసీపీ సర్కార్ ఇలా కొలువు తీరిందో లేదో కానీ బాబు కంటే ముందుగా కన్నా లక్ష్మీనారాయణ నోరు తెరిచేసారు. జగన్ ని అనరాని మాటలు అంటూ ఏపీలో పాలనే లేదని హాట్ కామెంట్స్ చేస్తూ వచ్చారు. అమరావతి రాజధాని, ఇసుక, ఇంగ్లీష్ మీడియం, అన్య మత ప్రచారం, ఉల్లి లొల్లి ఇలా ఎక్కడ సందు దొరికినా సరే నేనున్నానంటున్నారు కన్నా లక్ష్మీనారాయణ. అవన్నీ అలా ఉంచితే కన్నా లక్ష్మీనారాయణ ఇపుడు బాబు రూట్లోనే మాట్లాడుతున్నారని కూడా సెటైర్లు వైపు పడుతున్నాయి. అచ్చం బాబు గొంతుకనే కన్నా వినిపిస్తున్నారని అంటున్నారు.
సుజనా సాన్నిహిత్యం…
కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీలో కొత్త దోస్త్ మాజీ టీడీపీ నేత, తాజా కమలధారి సుజనా చౌదరి. ఈ ఇద్దరూ కలసి ఒకే మాటా. ఒకే బాట అంటున్నారు. అసలు బీజేపీ నేతలు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ వేరే పార్టీల నుంచి వచ్చిన ఈ ఇద్దరూ నిలువు బొట్టు, అడ్డం బొట్టు పెట్టుకుని మరీ సిసలైన కాషాయధారులమనిపించేసుకుంటున్నారు. కన్నా లక్ష్మీనారాయణ మాటలలో పదును పెరగడానికి సుజనా సాన్నిహిత్యం కూడా మరో ముఖ్య కారణం అంటారు. ఈ ఇద్దరూ కలసి ఆ మధ్య అమరావతి రాజధానిలో టూర్ వేయడమే కాదు, ఇక్కడ నుంచి తరలిస్తే చూస్తూ ఊరుకోమంటూ జగన్ సర్కార్ కి వార్నింగులు కూడా ఇచ్చేశారు.
యూటర్నే నా?
ఇక కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ సావాసం ఏంటో కానీ యూటర్న్ ల్లో టీడీపీ అధినేత చంద్రబాబుని సైతం మించిపోతున్నారు. నిన్నటి దాకా మూడు రాజధానులు భేష్. అసలు తమ డిమాండే అది అంటూ చెప్పుకొచ్చిన కన్నా లక్ష్మీనారాయణ ఒక్కసారిగా యూటర్న్ తీసేసుకున్నారు. అమరావతి రాజధానిని మార్చడమేంటని ఆయన మళ్ళీ జగన్ ని తగులుకుంటున్నారు. మూడు రాజధానులు కాదు, అమరావతి ఒక్కటే రాజధాని అంటూ కొత్త మాటలు వల్లె వేస్తున్నారు. అమరావతి రైతుల బాధలు వింటామని, ఒక ప్రతినిధి బృందాన్ని వారి కోసం పంపుతామని అంటున్నారు. ఇలా ఒక్కసారిగా కన్నా లక్ష్మీనారాయణ టోన్లో మార్పు రావడం వెనక రీజేంటో కానీ తాజాగా సుజనా అవే మాటలు మాట్లాడారు, ఇపుడు కన్నా లక్ష్మీనారాయణ గొంతు కూడా సవరించారు. మొత్తానికి కన్నా కూడా నిన్న మాట నేడు కాకుండా అంతా కొత్త కొత్తగా మాట్లాడేస్తున్నారు మరి.