కన్నా .. ఇక చాలు…!!
ఏపీ బీజేపీ సారధి, సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పదవికి సమయం సమీపించింది. బీజేపీ నిబంధనల మేరకు ప్రస్తుతం ఆయన పదివీ కాలం ముగిసింది. [more]
ఏపీ బీజేపీ సారధి, సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పదవికి సమయం సమీపించింది. బీజేపీ నిబంధనల మేరకు ప్రస్తుతం ఆయన పదివీ కాలం ముగిసింది. [more]
ఏపీ బీజేపీ సారధి, సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పదవికి సమయం సమీపించింది. బీజేపీ నిబంధనల మేరకు ప్రస్తుతం ఆయన పదివీ కాలం ముగిసింది. రెండేళ్ల కిందట ఏపీ బీజేపీ పగ్గాలు చేపట్టిన కన్నా లక్ష్మీనారాయణ త్వరలోనే ఆ పదవి నుంచి వైదొలగనున్నారు. ఇక, ఈ పదవిని ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న యువ నాయకుడు, ఆర్ ఎస్ ఎస్ మూలాలు ఉన్న మాధవ్‌కు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ రేసులో కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి సహా సోము వీర్రాజు వంటి వారు ఉన్నప్పటికీ కేంద్రంతో నిత్యం టచ్‌లో ఉండే నాయకులతో మాధవ్‌కు ఉన్న పరిచయాలు ఆయనకు కలిసి వస్తున్నాయి.
పదవీకాలం ముగియడంతో….
అదే సమయంలో మాధవ్‌కు ఆర్ఎస్ఎస్ భావజాలం, పార్టీ సిద్ధాంతాలపై పట్టు, మంచి గళం పార్టీ లైన్ మేరకు ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ ముందుకు సాగడం వంటివి ఆయనకు కలిసి వస్తున్న అంశాలు. ఆది నుంచి కూడా పార్టీలో ఉన్నారు. సో.. మాధవ్‌కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు త్వరలోనే నిర్ణయం వెలువరించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ఇక కన్నా లక్ష్మీనారాయణ పదవీ కాలాన్ని పరి శీలిస్తే బీజేపీ అధిష్టానం ఆశించిన స్థాయిలో కన్నా లక్ష్మీనారాయణ దూకుడు ప్రదర్శించలేక పోయారు.
ఫెయిలవ్వడంతో….
పార్టీని గాడిలో పెట్టలేక పోయారు. పైగా కాపు సామాజిక వర్గాన్ని పార్టీకి చేరువ చేయడంలోనూ విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. అసలు కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ అధిష్టానం పదవి ఇచ్చిందే కాపులను బీజేపీ వైపు తీసుకు వస్తారని. కానీ కన్నా లక్ష్మీనారాయణ ఆ విషయంలో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. కీలకమైన 2019 ఎన్నికల్లో నరసరావు పేట ఎంపీగా చేసిన కన్నా ఘోరంగా ఓడిపోయి డిపాజిట్ కూడా కోల్పోవడం పార్టీకి అవమానకరంగానే మారిందనడంలో సందేహం లేదు. ఇక, రాష్ట్రంలో ఎక్కడా కూడా బీజేపీ ఆశించిన మేరకు ఓట్లు కూడా సాధించలేక పోయింది.
రెన్యువల్ చేసే అవకాశం ఉన్నా….
పార్టీలో అంతర్గత విభేదాలను నిలువరించడంలోనూ కన్నా విఫలమయ్యారు. ప్రతి విషయంలోనూ కేంద్రం వచ్చి వివరణ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఈ కారణాల నేపథ్యంలోనే రెండోసారి ఈ పదవికి రెన్యువల్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కన్నా లక్ష్మీనారాయణకు ఆ అవకాశం ఇవ్వలేదనే ప్రచారం జరుగుతోంది. గతంలో విశాఖ మాజీ ఎంపీ కంభంపాటి బీజేపీ అధ్యక్షుడుగా రెండు సార్లు వరుసగా పగ్గాలు చేపట్టిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా జనసేన కూడా పొత్తు కుదుర్చుకోవడంతో మరో సామాజిక వర్గానికి అధ్యక్ష పదవిఇస్తే బాగుంటుదని కూడా కేంద్ర నాయకత్వం అభిప్రాయపడుతోంది.