కన్నా ఇక “సున్నా”గా మారిపోయినట్లేనా?
కన్నా లక్ష్మీనారాయణ పార్టీలో కొద్దిమందికే నాయకుడిగా కన్పిస్తున్నారు. మెజారిటీ పార్టీ నేతలు కన్నా లక్ష్మీనారాయణను రాష్ట్ర అధ్యక్షుడిగా అంగీకరించలేక పోతున్నారు. ఆయన పెడుతున్న సమావేశాలకు కూడా పెద్దగా [more]
కన్నా లక్ష్మీనారాయణ పార్టీలో కొద్దిమందికే నాయకుడిగా కన్పిస్తున్నారు. మెజారిటీ పార్టీ నేతలు కన్నా లక్ష్మీనారాయణను రాష్ట్ర అధ్యక్షుడిగా అంగీకరించలేక పోతున్నారు. ఆయన పెడుతున్న సమావేశాలకు కూడా పెద్దగా [more]
కన్నా లక్ష్మీనారాయణ పార్టీలో కొద్దిమందికే నాయకుడిగా కన్పిస్తున్నారు. మెజారిటీ పార్టీ నేతలు కన్నా లక్ష్మీనారాయణను రాష్ట్ర అధ్యక్షుడిగా అంగీకరించలేక పోతున్నారు. ఆయన పెడుతున్న సమావేశాలకు కూడా పెద్దగా హాజరు కావడం లేదు. దీంతో పాటు కన్నా లక్ష్మీనారాయణను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తారన్న ఊహాగానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కోరనా మహమ్మారి రాకుంటే ఈ పాటికే కన్నా పదవి ఊడిపోయేదన్న వ్యాఖ్యలు కూడా పార్టీలో బలంగా విన్పిస్తున్నాయి.
అనివార్య పరిస్థితుల్లో…..
నిజానికి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ సిద్ధాంతాల కోసం పార్టీలో చేరలేదు. ఆయన దశాబ్దాల రాజకీయ జీవితం కాంగ్రెస్ తోనే కొనసాగింది. 2014 ఎన్నికల తర్వాత కూడా కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అయతే 2019 ఎన్నికల నాటికి ఆయన బీజేపీలో అనివార్య పరిస్థితుల్లో చేరాల్సి వచ్చింది. ఈ విషయం కాషాయ జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరికీ తెలిసిందే. దీంతో కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ నేతగా సింహ భాగం నేతలు చూడలేదు.
దూరంగా కొందరు నేతలు…..
కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత కావూరి సాంబశివరావు, మాజీ అధ్యక్షుడు కంభం పాటి హరిబాబు లాంటి నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తొలినుంచి బీజేపీలో ఉండి, హైకమాండ్ వద్ద పట్టున్న సోము వీర్రాజు లాంటి నేతలు సయితం కన్నా లక్ష్మీనారాయణను దూరంగా పెడుతున్నారు. ఆయన తొలి నుంచి పార్టీని బలోపేతం చేయడంపై కన్నా వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకోవడం కోసమే పనిచేశారని బీజేపీ నేతలు అంతర్గత సంభాషణల్లో చర్చించుకుంటున్నారు.
సాయిరెడ్డి విమర్శలపై….?
అందుకే విజయసాయిరెడ్డి కన్నా లక్ష్మీనారాయణ మీద తీవ్ర ఆరోపణలు చేసినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కన్నా లక్ష్మీనారాయణ టీడీపీతో కోటి డీల్ కుదుర్చుకున్నారని చేసిన ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర పార్టీ మాత్రమే స్పందించింది. వ్యక్తిగతంగా సీనియర్ నేతలు ఎవరూ కన్నా లక్ష్మీనారాయణకు ఎవరూ అండగా నిలబడలేదు. సాయిరెడ్డి వ్యాఖ్యలను ఖండించడానికి ముందుకు రాలేదు. కరోనా తర్వాత కన్నా పదవి ఊడిపోతుందనే నేతలు లైట్ తీసుకున్నారన్న చర్చ పార్టీలో జరుగుతుంది. మొత్తం మీద కన్నా పార్టీలో సున్నాగా మిగిలిపోయారన్నది వాస్తవం.