కన్నా పదవి ఊడిపోవడానికి ఆయన పుణ్యమేనట
కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టి రెండు సంవత్సరాలు దాటింది. గత ఎన్నికల సమయంలోనే కన్నా లక్ష్మీనారాయణ పార్టీ బాధ్యతలను చూసినా ఏపీలో నోటాకు మించి [more]
కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టి రెండు సంవత్సరాలు దాటింది. గత ఎన్నికల సమయంలోనే కన్నా లక్ష్మీనారాయణ పార్టీ బాధ్యతలను చూసినా ఏపీలో నోటాకు మించి [more]
కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టి రెండు సంవత్సరాలు దాటింది. గత ఎన్నికల సమయంలోనే కన్నా లక్ష్మీనారాయణ పార్టీ బాధ్యతలను చూసినా ఏపీలో నోటాకు మించి ఓట్లు పార్టీకి రాలేదు. ఆయన పోటీ చేసిన స్థానం నుంచి కూడా ఓటమి పాలయ్యారు. అయతే ఎన్నికల్లో ఓటమి సహజం. వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలి. కానీ కన్నా లక్ష్మీనారాయణ మాత్రం వన్ సైడ్ గా వెళుతున్నారని పార్టీలోని కొన్ని వర్గాల నుంచి చాలా రోజుల నుంచి విన్పిస్తుంది.
టీడీపీ నుంచి వచ్చిన నేతలతో….
ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నేతలతో కన్నా లక్ష్మీనారాయణ అంటకాగుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. సుజనా చౌదరి చెప్పినట్లే కన్నా లక్ష్మీనారాయణ చేస్తున్నారని కూడా ఆరోపణలున్నాయి. సుజనా చౌదరి టీడీపీ అధినేత చంద్రబాబు నమ్మిన బంటు కావడంతో రాజధాని అమరావతి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో సుజనా చౌదరి డైరెక్షన్ లోనే కన్నా లక్ష్మీనారాయణ నడిచారన్న విమర్శలున్నాయి.
ఆరోపణలు వచ్చినా….
ిఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సయితం కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో పార్టీ నిధులను దుర్వినియోగం చేశారని, చంద్రబాబు నుంచి కోట్ల రూపాయలను కన్నా లక్ష్మీనారాయణ అందుకున్నారని ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ విమర్శలను కన్నా లక్ష్మీనారాయణ ఒక్కరే తిప్పికొట్టాల్సి వచ్చింది. పార్టీలో ముఖ్యులెవ్వరూ ఈ విషయంలో కన్నా లక్ష్మీనారాయణకు అండగా నిలవలేదు.
ఆ లేఖ చేటు తెచ్చిందా…?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి కన్నా లక్ష్మీనారాయణ మూడు రాజధానుల బిల్లులపై గవర్నర్ కు లేఖ రాయడం కూడా వివాదమయింది. ఈ విషయాన్ని బీజేపీలోని ఒక వర్గం నేతలు తప్పపట్టారు. కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ అధిష్టానం అక్షింతలు వేసిందని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇవన్నీ కలసి కన్నా లక్ష్మీనారాయణ పదవికి ఎసరు పెట్టాయంటున్నారు. ఏపీలో బీజేపీ పెద్దగా పుంజుకోదని తెలిసినా, గత ఎన్నికల సమయంలో మోదీ, షాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రచారం చేసిన చంద్రబాబుతో లోపాయికారీ ఒప్పందం ఉందన్న ఆరోపణలపైనే కన్నా లక్ష్మీనారాయణ పదవి ఊడిందన్నది ఇప్పుడు బీజేపీలో హల్ చేస్తున్న టాక్.