Kapu : మళ్లీ మొదలయిందా.. జగన్ లక్ష్యమా?
కాపు రిజర్వేషన్ల ఉద్యమం మరోసారి ప్రారంభమయ్యేటట్లే కన్పిస్తుంది. ఎన్నికలు ఇంకా మూడేళ్ల సమయం ఉండటం, పవన్ కల్యాణ్ కు అండగా నిలబడాల్సి ఉండటంతో మరోసారి కాపు రిజర్వేషన్ల [more]
కాపు రిజర్వేషన్ల ఉద్యమం మరోసారి ప్రారంభమయ్యేటట్లే కన్పిస్తుంది. ఎన్నికలు ఇంకా మూడేళ్ల సమయం ఉండటం, పవన్ కల్యాణ్ కు అండగా నిలబడాల్సి ఉండటంతో మరోసారి కాపు రిజర్వేషన్ల [more]
కాపు రిజర్వేషన్ల ఉద్యమం మరోసారి ప్రారంభమయ్యేటట్లే కన్పిస్తుంది. ఎన్నికలు ఇంకా మూడేళ్ల సమయం ఉండటం, పవన్ కల్యాణ్ కు అండగా నిలబడాల్సి ఉండటంతో మరోసారి కాపు రిజర్వేషన్ల ఉద్యమం ఊపందుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇటీవలే పవన్ కల్యాణ్ కాపు, ఒంటరి, బలిజలు ఏకమై లీడ్ చేయాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి కాపు పెద్దలు పూనుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.
గతంలో ముద్రగడ….
దీంతో కాపు రిజర్వేషన్లను మరోసారి తెరపైకి తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. నిన్న మొన్నటి వరకూ కాపు రిజర్వేషన్ల పోరాటాన్ని ముద్రగడ పద్మనాభం నిర్వహించేవారు. ఆయన ఆధ్వర్యంలో పెద్దయెత్తున ఆందోళనలు జరిగాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పడు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ముద్రగడ పద్మనాభం వ్యవహరించారన్న విమర్శలూ లేకపోలేదు. తుని సంఘటనతో కాపుల్లో అప్పటి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది.
దూరమయిన కాపులను….
ఆ కారణంగానే 2019 ఎన్నికల్లో కాపులు టీడీపీకి దూరమయ్యారన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కూడా కాపు రిజర్వేషన్లపై ఒక స్టాండ్ తీసుకోకపోవడంతో వారంతా వైసీపీకి దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ పిలుపు మేరకు కాపు సంక్షేమ సేన సమాయత్తమవుతుంది. కార్యాచరణకు సిద్ధమయింది. తొలుత పోస్టు కార్డు ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రికి పోస్టు కార్డుల ద్వారా ప్రతి నియోజకవర్గం నుంచి వెయ్యిమంది కాపు రిజర్వేషన్ల ఆవశ్యకత గురించి తెలియజేయాలన్నారు.
మరిన్ని ఉద్యమాలు….
అయితే కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్థులను ఏకం చేసే పనిని హరిరామ జోగయ్య ఉన్నారు. ప్రభుత్వంపై ఈ మూడేళ్లు పోరాటం చేసి పవన్ కల్యాణ్ కు అనుకూలంగా మార్చాలన్నది ఆయన ఉద్దేశ్యంగా ఉంది. కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదని, అది కేంద్రం చేతిలో ఉందని జగన్ చెప్పారు. కానీ రాజకీయంగా పవన్ కల్యాణ్ కు లబ్డి చేరేందుకు కాపు సంక్షేమ సేన, జనసేనకు అండగా ఉండే ప్రయత్నంలో ఉందనే చెప్పాలి.