ఆ పేరుతోటే కరణంలో దడ మొదలయిందట
అధికార పార్టీ వైసీపీలో ఒక విషయం ఆసక్తిగా మారింది. పరుచూరు నియోజకవర్గం అంటేనే ఓ ఎమ్మెల్యే జడిసి పోతున్నారట. “ఏం జరిగినా.. అక్కడకు మాత్రం వెళ్లను“ అని [more]
అధికార పార్టీ వైసీపీలో ఒక విషయం ఆసక్తిగా మారింది. పరుచూరు నియోజకవర్గం అంటేనే ఓ ఎమ్మెల్యే జడిసి పోతున్నారట. “ఏం జరిగినా.. అక్కడకు మాత్రం వెళ్లను“ అని [more]
అధికార పార్టీ వైసీపీలో ఒక విషయం ఆసక్తిగా మారింది. పరుచూరు నియోజకవర్గం అంటేనే ఓ ఎమ్మెల్యే జడిసి పోతున్నారట. “ఏం జరిగినా.. అక్కడకు మాత్రం వెళ్లను“ అని ఆయన తన అనుచరులతో చెబుతున్నారట. దీంతో ఇదే విషయాన్ని మీడియాకు సైతం లీకులు ఇస్తున్నారు. అసలు ఆయన ఎందుకు అంత భయపడుతున్నారు? ఏం జరిగింది? అనేది వైసీపీ నేతల మధ్య చర్చగా మారింది. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడానికి ఇబ్బందే. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై విజయం దక్కించుకున్న ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీగా పేరున్న కరణం బలరామకృష్ణమూర్తి చీరాల నుంచి విజయం సాధించారు. అయితే, ఆయనకు ఇక్కడ వైసీపీ నేతలతో పొసగడం లేదు. దీనికి ఆయన చేసుకున్న స్వయంకృత కారణాలే కనిపిస్తున్నాయి. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు అనుసరించిన వైఖరినే ఆయన ఇక్కడ కూడా ఆనుసరిస్తున్నారు.
అందరూ యాంటీనే….
దీనిని వైసీపీ నాయకులు ఖండిస్తున్నారు. “అయ్యా.. ఇది వైసీపీ, టీడీపీ కాదు. కాస్త చూసుకుని అడుగులు వేయండి“ అని సూచిస్తున్నారు. అయితే.. కరణం బలరాం మాత్రం తన దూకుడును ఆపడం లేదు. దీంతో వైసీపీలో అందరూ ఇప్పుడు కరణం బలరాం కు యాంటీ అయ్యారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ చేసినా.. వైసీపీ తరఫున ఆయన గెలవడం సాధ్యం కాదని.. కరణం బలరాం సొంత మనుషులే అంగీకరిస్తున్నారు.. ఈ నేపథ్యంలో ఇప్పటికే పార్టీ అధిష్టానం ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చింది. “మీరు అవకాశం ఉంటే.. పరుచూరుకు వెళ్లండి“ అని స్వయంగా జగన్ నుంచే ఆయనకు వర్తమానం అందింది. నిజానికి ఇది వైసీపీలో ఉన్న నేతగా, మరీ ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతగా కరణం బలరాంకు అందివచ్చిన అవకాశం. ఎందుకంటే పరుచూరులో కరణం బలరాం సామాజిక వర్గం ప్రభావం ఎక్కువ.
అక్కడికే పరిమితమై…?
ఎందుకంటే.. ఇప్పటి వరకు కరణం బలరాం రాజకీయాలు అద్దంకి, చీరాలకే పరిమితమయ్యాయి. ఇక, ఇప్పుడు ఆయన సత్తా నిరూపించుకునేందుకు పరుచూరును వైసీపీ ఆయన చేతిలో పెడతానని చెబుతోంది. పైగా చీరాల అయితే.. వివాదం ఉంది. కానీ, పరుచూరులో కరణం బలరాంకు తిరుగులేదు. ఆయనకు పోటీగా వచ్చే నాయకుడు కూడా లేరు. అంతేకాదు.. కమ్మ సామాజిక వర్గం కూడా అక్కడ ఆయనకు కలిసి వస్తుందని వైసీపీ లెక్కలు వేస్తోంది. కరణం బలరాం మాత్రం.. పరుచూరు వైపు తలెత్తి చూడడం లేదు. దీనికి రెండు కారణాలు ఉన్నాయని.. ఆయన వర్గం తెరచాటుగా చెబుతోంది. ఒకటి.. పరుచూరులో కరణం దూకుడు పనికిరాదని.. ఆయన అక్కడ తన ఇష్టాను సారం వ్యవహరిస్తే.. కుదరదని.. అందుకే జంకుతున్నారని అంటున్నారు.
బలమైన నేత ఉండటంతో….?
అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి బలంగా ఉండడం.. ఆయనను ఢీకొట్టి నిలిచే సత్తా.. కరణం బలరాం లేకపోవడం వంటివి కారణాలుగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. కానీ కరణం బలరాం వర్గం ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తోంది. అనుకూలంగా ఉన్న చోట ఎవరైనా గెలుస్తారని. కానీ, పరుచూరు వంటి నియోజకవర్గంలో గెలిస్తేనే కరణం బలరాం సత్తా తెలుస్తుందని.. ఆయన అక్కడ కు వెళ్లడమే మంచిదని అంటున్నారు. పరుచూరులో కనుక విజయం దక్కించుకుంటే.. ఇక, కరణం బలరాంపై ఇప్పటి వరకు ఉన్న వ్యాఖ్యలు.. ఇతరత్రా విమర్శలు కూడా తొలిగిపోయే అవకాశం ఉందని.. చీరాలను పట్టుకుని వేలాడడం వల్ల ఆయనకు ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. అయినప్పటికీ.. కరణం బలరాం మాత్రం ఈ విషయంలో మొగ్గు చూపడం లేదు. మరి చివరాఖరుకు ఏం జరుగుతుందో చూడాలి.