కరణం మళ్లీ సైడ్ కాక తప్పదా?
అద్దంకి అంటేనే పంచాయతీలే. ఇక్కడ రాజకీయంగా మహామహులు ఉండటంతో ఇక్కడ ఏ పార్టీలోనైనా టిక్కెట్ల పంచాయతీ తప్పదు. అద్దంకి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది కరణం, గొట్టిపాటి [more]
అద్దంకి అంటేనే పంచాయతీలే. ఇక్కడ రాజకీయంగా మహామహులు ఉండటంతో ఇక్కడ ఏ పార్టీలోనైనా టిక్కెట్ల పంచాయతీ తప్పదు. అద్దంకి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది కరణం, గొట్టిపాటి [more]
అద్దంకి అంటేనే పంచాయతీలే. ఇక్కడ రాజకీయంగా మహామహులు ఉండటంతో ఇక్కడ ఏ పార్టీలోనైనా టిక్కెట్ల పంచాయతీ తప్పదు. అద్దంకి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది కరణం, గొట్టిపాటి ఫ్యామిలీలే. గత కొన్ని దశాబ్దాలుగా ఈ రెండు కుటుంబాలే అద్దంకి రాజకీయాలను శాసిస్తున్నాయి. రెండు కుటుంబాలు చెరో పార్టీలో ఉండటం ఆనవాయితీగా వస్తుంది. అయితే రాష్ట్ర విభజన తర్వాత రెండు కుటుంబాలు టీడీపీలోకి వచ్చాయి. 2019 ఎన్నికల తర్వాత మళ్లీ వేర్వేరు పార్టీల్లో ఉన్నాయి.
వచ్చే ఎన్నికల్లో….
ఇక వచ్చే ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ నుంచే గొట్టిపాటి రవికుమార్ పోటీ చేయనున్నారు. ఆ పార్టీలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఇక వైసీపీలో ఇప్పటి నుంచే రాజకీయ విభేదాలు కన్పిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిచిన కరణం బలరాం వైసీపీకి మద్దతుదారుగా మారిపోయారు. ఆయన తనయుడు వెంకటేష్ జగన్ చేతులు మీదుగా కండువా కప్పించేసుకున్నారు. అద్దంకి నియోజకవర్గ ఇన్ చార్జి పదవిని కరణం వెంకటేష్ కోరుకున్నారు. కరణం బలరాం మద్దతివ్వడానికి కూడా అదే ప్రధాన కారణం.
బాచిన కుటుంబం……
అయితే అద్దంకి నియోజకవర్గానికి బాచిన చెంచుగరటయ్య తనయుడు కృష్ణ చైతన్య ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమార్ మీద ఓడిపోయిన బాచిన కుటుంబం తమకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని మరోసారి కల్పంచాలని కోరుతుంది. అందుకే అద్దంకి నియోజకవర్గంలో బాచిన కృష్ణ చైతన్య విస్తృతంగా పర్యటిస్తున్నారు. అభివృద్ధి పనులను సమీక్షిస్తూ ఇప్పటకే అనధికారికంగా ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు.
కరణం వర్గీయుల్లో….
ఇక కరణం బలరాం ఏం ఉద్దేశ్యంతోనైతే పార్టీకి మద్దతుదారుగా వచ్చారో అది నేరవేరలేదు. ఆ అసంతృప్తి కరణం వర్గీయుల్లో ఉంది. కరణం వెంకటేష్ ను వచ్చే ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలన్నది కరణం ఆలోచన. ఇప్పటి నుంచే శ్రమిస్తే తప్ప విజయం సాధ్యంకాదు. కానీ ఇన్ ఛార్జి పదవి ఇవ్వకపోవడంతో కరణం వర్గీయులు గుస్సా అవుతున్నారు. వైసీపీ అధినాయకత్వం మాత్రం బాచిన కృష్ణ చైతన్యనే ఇన్ ఛార్జిగా కొనసాగిస్తుండటం విశేషం.