Karanam : కరణం కంఫర్ట్ గా లేరట
తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కంఫర్ట్ గా ఉన్న నేతలు వైసీపీలో చేరిన తర్వాత ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు వారిని పునరాలోచనలో పడేలా చేస్తున్నాయి. [more]
తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కంఫర్ట్ గా ఉన్న నేతలు వైసీపీలో చేరిన తర్వాత ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు వారిని పునరాలోచనలో పడేలా చేస్తున్నాయి. [more]
తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కంఫర్ట్ గా ఉన్న నేతలు వైసీపీలో చేరిన తర్వాత ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు వారిని పునరాలోచనలో పడేలా చేస్తున్నాయి. 2019 లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి చవి చూసిన తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. అధికారికంగా వీడకపోయినా వైసీపీ మద్దతు దారులగా నిలిచారు. వీరిలో ముగ్గురికి తిరిగి టీడీపీలోకి వచ్చే అవకాశం లేకున్నా, కరణం బలరాంకు మాత్రం తిరిగి సొంత పార్టీలోకి రావాలన్న ఆలోచనలో ఉన్నారు.
వైసీపీకి మద్దతిచ్చినా….
కరణం బలరాం సుదీర్ఘకాలం తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. ఆయన తన వారసుడు కరణం వెంకటేష్ కోసం పార్టీని వీడాల్సి వచ్చింది. అయితే వైసీపీలో చేరినా ఆయన సంతోషంగా లేరు. దీనికి ప్రధాన కారణం ఆమంచి కృష్ణమోహన్ కు ఆ పార్టీ ప్రాధాన్యత ఇవ్వడమే. అందుకే కరణం బలరాం సైలెంట్ గా ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యేగానే అనధికారికంగా చెలామణి అవుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ మీద ఎటువంటి విమర్శలు చేయడం లేదు.
టీడీపీలో ప్రాధాన్యత….
కరణం బలరాంకు తెలుగుదేశం పార్టీలో విశేష ప్రాధాన్యత ఉంది. ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చి చంద్రబాబు గౌరవించారు. తర్వాత అద్దంకి ఇవ్వకుండా చీరాల నియోజకవర్గానికి కరణం బలరాంను షిప్ట్ చేశారు. అక్కడ గెలిచిన కరణం తర్వాత వైసీపీకి మద్దతిచ్చారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలసి పోటీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. చీరాల నియోజకవర్గం సామాజికవర్గాలను పరిగణనలోకి తీసుకుంటే టీడీపీలోకి వెళ్లడమే మంచిదనుకుంటున్నారు.
అందుకే సైలెంట్ గా…
చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ ఇప్పటికీ బలమైన నేత. వచ్చే ఎన్నికలలో చీరాల నియోజకవర్గం టిక్కెట్ తనకు వైసీపీ ఇస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు. తన కుమారుడికి అద్దంకి టిక్కెట్ ఇచ్చే అవకాశాలయితే ఉన్నాయి. అయితే మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా తనకు టీడీపీయే సేఫ్ ప్లేస్ అని కరణం బలరాం భావిస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన, టీడీపీ కాంబినేషన్ చీరాలలో వర్క్ అవుట్ అవుతుందని ఆయన నమ్ముతున్నారు. అందుకే ఆయన సైలెంట్ గా ఉన్నారని చెబుతున్నారు. ఏ క్షణంలోనైనా కరణం జెండా పీకే అవకాశాలు కన్పిస్తున్నాయి.