క”రణం” ఆగేట్లు లేదు.. ఆమంచి తగ్గేట్లు లేడు
వైసీపీ అనవసరంగా గోక్కున్నట్లు కన్పిస్తుంది. ఇద్దరూ హేమాహేమీలే. ఇద్దరూ షార్ట్ టెంపర్ నేతలే. వీరిద్దరనీ ఒకచోట చేర్చాలని జగన్ వేసుకున్న అంచనా తప్పు అని తేలిపోయింది. చీరాల [more]
వైసీపీ అనవసరంగా గోక్కున్నట్లు కన్పిస్తుంది. ఇద్దరూ హేమాహేమీలే. ఇద్దరూ షార్ట్ టెంపర్ నేతలే. వీరిద్దరనీ ఒకచోట చేర్చాలని జగన్ వేసుకున్న అంచనా తప్పు అని తేలిపోయింది. చీరాల [more]
వైసీపీ అనవసరంగా గోక్కున్నట్లు కన్పిస్తుంది. ఇద్దరూ హేమాహేమీలే. ఇద్దరూ షార్ట్ టెంపర్ నేతలే. వీరిద్దరనీ ఒకచోట చేర్చాలని జగన్ వేసుకున్న అంచనా తప్పు అని తేలిపోయింది. చీరాల నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ల మధ్య సఖ్యత కుదరలేదు. గత కొన్ని రోజులుగా చీరాలలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే వీరిద్దరి మధ్య ఐక్యత అసాధ్యమని దాదాపుగా తేలిపోయింది.
వరసగా గెలిచి….
చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ కు మంచి పట్టుంది. వరసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సొంతంగా నవోదయ పార్టీ పెట్టి మరీ విజయం సాధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆమంచి కృష్ణమోహన్ పేరు మారుమోగింది. ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన ఆమంచి 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక్కడ కరణం బలరాం టీడీపీ నుంచి విజయం సాధించారు. కరణం బయట నుంచి వచ్చిన వారు. ఆమంచి లోకల్ లీడర్.
ముగ్గురూ ఒక్కటవ్వడంతో…
చీరాలలో ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి. టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీకి మద్దతు పలికారు. ఆయనతో పాటు టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత, మాజీ మంత్రి పాలేటి రామారావులు వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు చీరాల వైసీపీలో టీడీపీ నుంచి వచ్చిన నేతల డామినేషన్ ఎక్కువయింది. టీడీపీ నుంచి వచ్చి చేరిన ముగ్గురు నేతలు ఒక్కటి కావడతో ఆమంచి కృష్ణమోహన్ ఒంటరి వాడయ్యారు. అయినా ఆమంచి చీరాలలో తన హవా తగ్గడానికి ఏమాత్రం అంగీకరించడం లేదు.
మంత్రి పంచాయతీ కూడా….
కరణ బలరాం వైసీపీికి మద్దతు పలకనంత వరకూ చీరాలలో ఆమంచి ఆధిపత్యమే కొనసాగింది. అధికారిక కార్యక్రమాల్లోనూ ఆమంచి పాల్గొనే వారు. కానీ కరణం వైసీపీకి మద్దతు తెలిపిన తర్వాత అధికారులు ఆమంచిని లెక్క చేయడం లేదు. దీంతో ఆయనలో అసహనం పెరిగిదంటున్నారు. ఈ మేరకు మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డికి ఆమంచి ఫిర్యాదు చేశారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి బాలినేని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో చీరాల వైసీపీలో ఇప్పుడు పెత్తనం కోసం ఫైట్ ప్రారంభమయింది. క్యాడర్ లో అయోమయం నెలకొంది. మరి జగన్ దీనిని ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి.