రెడీ అయిపోతున్నారా?
కర్ణాటక ఓటర్లు తీర్పును నిక్షిప్తం చేశారు. రేపు ఉదయం యడ్యూరప్ప భవితవ్యం తేలనుంది. మొత్తం పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఓటరు దేవుళ్లు [more]
కర్ణాటక ఓటర్లు తీర్పును నిక్షిప్తం చేశారు. రేపు ఉదయం యడ్యూరప్ప భవితవ్యం తేలనుంది. మొత్తం పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఓటరు దేవుళ్లు [more]
కర్ణాటక ఓటర్లు తీర్పును నిక్షిప్తం చేశారు. రేపు ఉదయం యడ్యూరప్ప భవితవ్యం తేలనుంది. మొత్తం పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఓటరు దేవుళ్లు ఎవరివైపు మొగ్గు చూపారన్నది కొద్ది గంటల్లోనే తేలనుంది. పదిహేను నియోజకవర్గాల ఉప ఎన్నికలను ఇటు యడ్యూరప్ప అటు సిద్ధరామయ్య ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇద్దరూ హోరాహోరీగా ప్రచారం చేయడమే కాకుండా ఎన్నికలను వ్యక్తిగతంగా తీసుకున్నారు.
ఆరు స్థానాలను ఖచ్చతంగా……
అయితే భారతీయ జనతా పార్టీ అధికారాన్ని నిలుపుకోవాలంటే ఆరు స్థానాలను ఖచ్చితంగా గెలుచుకోవాల్సి ఉంటుంది. బీజేపీలో కొంత ఆత్మవిశ్వాసం పెరిగింది. ఓటరు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చారన్నది కమలనాధుల అంచనా. యడ్యూరప్ప ప్రచారంతో పాటు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు త్వరలో జరిగే మంత్రి వర్గ విస్తరణలో చోటు కల్పిస్తానని యడ్యూరప్ప హామీ ఇవ్వడం కూడా ఓటరు బీజేపీ వైపు మొగ్గు చూపాడన్నది ఆ పార్టీ నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు.
సర్వేలన్నీ బీజేపీ వైపే….
ఇక ఎగ్జిట్ పోల్స్ కూడా భారతీయ జనతా పార్టీకే అనుకూలంగా వచ్చాయి. బీజేపీకి తక్కువలో తక్కువగా పది స్థానాలు వస్తాయని అన్ని సంస్థలూ సర్వేలో తేల్చాయి. కాంగ్రెస్ మూడు నుంచి ఆరు స్థానాల వరకే పరిమిత మవుతుందని, జనతాదళ్ ఎస్ మాత్రం ఒక్క స్థానంతో సరిపెట్టుకుంటుందని సర్వేలు తేల్చాయి. సర్వేలు పూర్తిగా బీజేపీ వైపు ఉండటంతో కమలదళంలో ఉత్సాహం అలుముకుంది. యడ్యూరప్ప పూర్తి కాన్ఫడెన్స్ తో ఉన్నారు.
కాంగ్రెస్ లో కొంత ఆశ…..
కాంగ్రెస్ మాత్రం ఎగ్జిట్ పోల్స్ అనేకసార్లు తప్పు అయిన విషయాలను గుర్తు చేసుకుంటూ తృప్తి పడుతుంది. కాంగ్రెస్ కు బలమైన అభ్యర్థులు లేకపోవడమే మైనస్ గా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే ఎన్నికలు జరిగిన వెంటనే బీజేపీ అక్రమాలు చేసిందంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కుమారస్వామి తమతో కలసి వస్తారని ప్రకటించడంతో ఆశతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు ఎలాంటి అనుభవాన్ని చూపిస్తాయో చూడాల్సిందే మరి.