అందుకే బెంగళూరుకు అంతగా?
బెంగళూరు హై డేంజర్ జోన్ లో ఉంది. కర్ణాటక ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. వందకు పైగా కరోనా పాజిటివ్ కేసులు [more]
బెంగళూరు హై డేంజర్ జోన్ లో ఉంది. కర్ణాటక ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. వందకు పైగా కరోనా పాజిటివ్ కేసులు [more]
బెంగళూరు హై డేంజర్ జోన్ లో ఉంది. కర్ణాటక ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. వందకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు 64 మంది కర్ణాటక వాసులు ఢిల్లీలో జరిగిన జమాత్ కు వెళ్లి వచ్చినట్లు కనుగొన్న ప్రభుత్వం వారిని క్వారంటైన్ కు తరలించేందుకు సిద్దమవుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. ఈ కరోనా వైరస్ వల్ల కర్ణాటకలో నలుగురు మృతి చెందారు.
ఎక్కువ మంది…..
కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా బెంగళూరు, బళ్లారి, చిక్ బళ్లాపుర, మైసూరు, ఉత్తర, దక్షిణ కర్ణాటక ప్రాంతంలో ఎక్కువగా నమోదయ్యాయి. ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఇప్పటికే లాక్ డౌన్ ను కఠినంగా అమలు పర్చాలని నిర్ణయించారు. నిత్యావసర వస్తువులను కూడా అవసరమైతే ఇంటి వద్దకే పంపిణీ చేయాలని భావిస్తున్నారు. కరోనా ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియను చేపట్టారు.
ఆర్థికంగా చితికిపోయి….
ఇప్పటికే కర్ణాటక రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయింది. ఇటీవల సంభవించిన వరదలతో దాదాపు పదివేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని ఆశించినా అది అంతంత మాత్రమే దక్కింది. దీనికి తోడు కరోనా రావడం గత పది రోజులుగా లాక్ డౌన్ ఉండటంతో ప్రభుత్వ ఆదాయం కూడా గణనీయంగా తగ్గిపోయింది. ప్రజల నుంచి రావాల్సిన పన్నులు కూడా రాష్ట్ర ఖజానాకు చేరలేదు. దీంతో ఆర్థికంగా కన్నడ రాష్ట్రం ఇబ్బందుల్లో చిక్కుకుంది.
ట్రావెల్ హబ్ కావడం వల్లనే….
కర్ణటాక ట్రావెట్ హబ్ కావడంతోనే ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. బెంగళూరు, మైసూరు, మంగళూరు తదితర ప్రాంతాల్లో విదేశాలకు రాకపోకలు ఎక్కువగా ఉండటంతోనే కేసుల తీవ్రత ఎక్కువగా ఉందంటున్నారు. అంతేకాకుండా ఢిల్లీ మర్కజ్ మసీదుకు వెళ్లి వచ్చిన వారితో కేసుల సంఖ్య మరింత పెరిగిందని భావిస్తున్నారు. మొత్తం మీద యడ్యూరప్ప అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు చేస్తూ కరోనా కట్టడికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.