నెంబర్ గేమ్ కు బ్రేక్…!!!
కర్ణాటక రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈరోజు కుమారస్వామి విశ్వాస పరీక్షను ఎదుర్కొంటారని భావించారు. అయితే అసంతృప్త ఎమ్మెల్యేలపై ఇంకా ఆశలు చావని కాంగ్రెస్ బలపరీక్షను [more]
కర్ణాటక రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈరోజు కుమారస్వామి విశ్వాస పరీక్షను ఎదుర్కొంటారని భావించారు. అయితే అసంతృప్త ఎమ్మెల్యేలపై ఇంకా ఆశలు చావని కాంగ్రెస్ బలపరీక్షను [more]
కర్ణాటక రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈరోజు కుమారస్వామి విశ్వాస పరీక్షను ఎదుర్కొంటారని భావించారు. అయితే అసంతృప్త ఎమ్మెల్యేలపై ఇంకా ఆశలు చావని కాంగ్రెస్ బలపరీక్షను వాయిదా వేయాలని కాంగ్రెస్ కోరుతోంది. యడ్యూరప్ప మాత్రం ఈరోజే విశ్వాస పరీక్ష జరపాలని డిమాండ్ చేశారు. కాని ముఖ్యమంత్రి కుమారస్వామి విశ్వాస పరీక్ష మరికొంత కాలం వాయిదా పడే అవకాశం ఉంది. విశ్వాస పరీక్షపై అందరూ చర్చించిన తర్వాత ఓటింగ్ కు వెళ్లాలన్నది స్పీకర్ రమేష్ కుమార్ నిర్ణయం.
ఎలాగైనా ముగించాలని…..
ఎలాగైనా ఈరోజు విశ్వాసపరీక్ష ఎపిసోడ్ ను ముగించి అధికారంలోకి రావాలని యడ్యూరప్ప భావిస్తున్నారు. అయితే స్పీకర్ ఆ అవకాశం ఇవ్వరని యడ్యూరప్పకు తెలియంది కాదు. స్పీకర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత కావడంతో ఆ పార్టీకి అనుకూలంగానే నిర్ణయం తీసుకుంటారన్నది అందరూ అంగీకరించే విషయం. అందుకే ఆయన రాజ్ భవన్ ను ఆశ్రయించారు. బీజేపీ ఎమ్మెల్యేలతో కలసి గవర్నర్ వద్దకు వెళ్లి పరిస్థితిని యడ్యూరప్ప వివరించారు. గవర్నర్ వాజూభాయి వాలా కూడా ఈరోజే విశ్వాస పరీక్ష నిర్వహించాలని స్వయంగా స్పీకర్ కు లేఖ రాశారు.
23 మంది గైర్హాజరు…
మరోవైపు ఈరోజు ఉదయం శాసనసభ ప్రారంభం అయింది. సభకు 21 మంది సభ్యులు గైర్హాజరయ్యారు. ఇందులో 14 మంది కాంగ్రెస్ సభ్యులు, ముగ్గురు జనతాదళ్ సభ్యులు, ముగ్గురు బీజేపీ సభ్యులున్నారు. ఇద్దరు స్వతంత్ర సభ్యులు, ఒక బీఎస్పీ ఎమ్మెల్యే హాజరుకాలేదు. ఈరోజు విశ్వాస పరీక్ష జరిగి ఉంటే యడ్యూరప్పదే విజయం అయ్యేది. కాంగ్రెస్, జేడీఎస్ లకు కలసి మొత్తం సభలో సభ్యుల సంఖ్య 99 మంది మాత్రమే. శాసనసభకు హాజరయిన సభ్యుల సంఖ్య 201 మంది. 101 మంది సభ్యుల మద్దతు అవసరం అవుతుంది. అందుకే అన్నీ లెక్కలు వేసుకున్న కాంగ్రెస్, జేడీఎస్ లు విశ్వాసపరీక్షను వాయిదా వేసేందుకు ఉదయం నుంచి పావులు కదుపుతున్నాయి.
నైరాశ్యంలో కుమారస్వామి….
ఒక దశలో ముఖ్యమంత్రి కుమారస్వామి నైరాశ్యంలో కన్పించారు. అధికారం శాశ్వతం కాదని ఆయన తన ప్రసంగంలో వ్యాఖ్యానించడం ఇందుకు అద్దం పడుతుంది. అందుకే కొంత సమయం కావాలని భావించారు. స్పీకర్ రమేష్ కుమార్ సయితం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అయినా పార్టీలు విప్ జారీ చేసుకునే అవకాశముందని చెప్పారు. స్పీకర్ అడ్వకేట్ జనరల్ సలహా తీసుకున్న తర్వాతే నిర్ణయం ప్రకటిస్తారని తెలిసింది. మొత్తం మీద కర్ణాటక హై డ్రామాకు ఇప్పుడప్పుడే తెరపడేలా లేదు. రోజంతా జరిగిన నాటకీయ పరిణామాల అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. రేపైనా బలపరీక్ష జరగుతుందా? లేదా? అన్నది అనుమానమే.