గుంటూరు వైసీపీ మేయర్ ఖరారైనట్టే ? చక్రం తిప్పిన బొత్స
ఏపీలో పలు కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నా ప్రధానంగా అందరి దృష్టి మూడు కార్పొరేషన్ల మీదే ఉంది. రాజధాని ప్రాంతంలో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం కార్పొరేషన్ల ఫలితాలపైనే ఆసక్తి [more]
ఏపీలో పలు కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నా ప్రధానంగా అందరి దృష్టి మూడు కార్పొరేషన్ల మీదే ఉంది. రాజధాని ప్రాంతంలో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం కార్పొరేషన్ల ఫలితాలపైనే ఆసక్తి [more]
ఏపీలో పలు కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నా ప్రధానంగా అందరి దృష్టి మూడు కార్పొరేషన్ల మీదే ఉంది. రాజధాని ప్రాంతంలో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం కార్పొరేషన్ల ఫలితాలపైనే ఆసక్తి ఉంది. రాజధాని అమరావతి ఉన్న గుంటూరు కార్పొరేషన్లో పాగా వేసేందుకు వైసీపీ, టీడీపీ హోరాహోరీగా పోరాటం చేస్తున్నాయి. వైసీపీ వేవ్ ఎలా ఉన్నా గత ఎన్నికల్లో ఇక్కడ నగరంలో వెస్ట్ సీటు టీడీపీ గెలుచుకోవడంతో పాటు.. ఆ తర్వాత రాజధాని మార్పు పరిణామాలు.. అమరావతి ఉద్యమం ఇక్కడ మాత్రం టీడీపీకి కాస్త ఊపిరిలూదే అంశాలు. టీడీపీ నుంచి గెలిచిన గిరి పార్టీ మారినా… టీడీపీకి అక్కడ సంస్థాగతంగా బలమైన కేడర్ ఉంది.
జనరల్ కు రిజర్వ్ కావడంతో…
గుంటూరు కార్పొరేషన్‌కు చివరిసారిగా 2005లో మాత్రమే ఎన్నికలు జరిగాయి. అప్పట్లో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, సీనియర్ ఎంపీ రాయపాటి సాంబశివరావు కేంద్రంగా రాజకీయాలు నడవడంతో మేయర్ పీఠాన్ని ఈ రెండు కుటుంబాల వారసులు సగం సగం పంచుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు గుంటూరుకు 16 ఏళ్ల తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ ఎలాగైనా మేయర్ పీఠంపై పాగా వేసి… రాజధాని మార్పు ప్రభావం లేదని చెప్పేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ క్రమంలోనే జనరల్‌కు రిజర్వ్ అయిన మేయర్ పీఠం రేసులో పార్టీ నుంచి కావటి మనోహర్ నాయుడు రేసులో ఉన్నారు.
బొత్స అనుచరుడిగా….
మంత్రి బొత్స సత్యనారాయణకు అనుంగు అనుచరుడిగా పేరున్న కావటి 2005లో కార్పొరేటర్‌గా గెలిచినా… రాయపాటి, కన్నా వ్యూహాలతో మేయర్ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక గత ఎన్నికలకు ముందు తప్పనిసరి పరిస్థితుల్లో పెదకూరపాడు పార్టీ ఇన్చార్జ్గా రెండేళ్ల పాటు ఉన్నారు. ఎమ్మెల్యే సీటు దక్కుతుందనుకుంటోన్న టైంలో క్యాస్ట్ ఈక్వేషన్లు దెబ్బకొట్టడంతో ఆయన పెదకూరపాడు సీటు త్యాగం చేయాల్సి వచ్చింది. ఎన్నికల ముందు కమ్మ వర్గానికి చెందిన నంబూరు శంకర్రావుకు పెదకూరపాడు సీటు ఇచ్చారు. అప్పట్లోనే కావటికి మంచి పదవి ఇస్తామన్న హామీ వచ్చింది. ఎట్టకేలకు కావటిని ఊరించి ఊరించి వస్తోన్న పదవి మేయర్ రూపంలో వరించనుంది.
ఆయనకే అవకాశం….
మంత్రి బొత్స చక్రం తిప్పడంతో పాటు వైవి. సుబ్బారెడ్డి సైతం కావటి మనోహర్‌కే గుంటూరు మేయర్ పీఠం కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. తాజా కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన 20వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేస్తున్నారు. ఈ కీలక సమరంలో గుంటూరులో అధికార పార్టీకి ఎక్కువ డివిజన్లు వస్తే కావటి గుంటూరు మేయర్ పీఠంపై కూర్చోవడం ఖాయం. మరి కావటి అదృష్టం ఎలా ఉందో ? చూడాలి.