జగన్ సీరియస్ గానే తీసుకుంటారా?
కేసీఆర్ విషయం తీసుకుంటే ఆయన చాలా తెలివైన రాజకీయ నాయకుడిగా చెబుతారు. ఎంత తెలివి అంటే రాజకీయ గురువు చంద్రబాబు కంటే మించిన తెలివి. అందుకే ఆయన [more]
కేసీఆర్ విషయం తీసుకుంటే ఆయన చాలా తెలివైన రాజకీయ నాయకుడిగా చెబుతారు. ఎంత తెలివి అంటే రాజకీయ గురువు చంద్రబాబు కంటే మించిన తెలివి. అందుకే ఆయన [more]
కేసీఆర్ విషయం తీసుకుంటే ఆయన చాలా తెలివైన రాజకీయ నాయకుడిగా చెబుతారు. ఎంత తెలివి అంటే రాజకీయ గురువు చంద్రబాబు కంటే మించిన తెలివి. అందుకే ఆయన ఉపసభాపతిగా ఉంటూ టీడీపీకి రాజీనామా చేసిన సమయంలో ఉమ్మడి ఏపీకి మళ్ళీ సీఎం కానివ్వను చంద్రబాబూ అని శపధం చేసారు. అది నేరవేర్చుకున్నారు కూడా. అంతే కాదు, కేవలం ఒక మంత్రి పదవి కోసం పార్టీని వీడారని ప్రచారం ఉన్నా కూడా కేసీఆర్ ఆ తరువాత రాజకీయంగా ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారు, ఆయన రెండవసారి వరసగా సీఎం తెలంగాణాకు అయ్యారు. సమీప భవిష్యత్తులో ఢీ కొట్టే నాయకుడు, పార్టీ లేకుండా మొత్తం చక్రం తిప్పుతున్నారు.
బాబు కంటే కూడా….
కేసీఆర్ రాజకీయం ముందు చంద్రబాబే తక్కువ అని అంటారు. ఆయన రాజకీయ తెలివిడి అలాంటిది మరి. ఇక వైఎస్సార్ రాజకీయం చూస్తే ఆయన ముక్కుసూటిగా చేసినా అందులో కొంత అనుభవం కూడా రంగరించి ఉండడం, పైగా కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీ తరఫున రాజకీయం చేయడం వల్ల ఆయనకు ఇబ్బందులు వచ్చిన సేఫ్ గార్డ్ గా కాంగ్రెస్ ఢిల్లీలో ఉండేది. సో వైఎస్సార్ ఎత్తులకు కాంగ్రెస్ జాతీయ నాయకత్వం బలం తోడు కావడంతో ఓ విధంగా కేసీఆర్ అప్పట్లో ఆయన మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్ద యుధ్ధమే చేయాల్సివచ్చేది. కేసీఆర్ కి ఆ విధంగా వైఎస్సార్ మీద సాఫ్ట్ కార్నర్ కొంత తక్కువే. ఆ ఇద్దరు నేతలతో పోల్చినపుడు వయసు రిత్యా, ఇతరత్రా కూడా జగన్ కేసీఆర్ కంటే తక్కువ. పైగా ఇబ్బందిలేని రాజకీయం కూడా ఆయనతో ఉంటుంది. అందువల్ల జగన్ అంటే కేసీఆర్ కి కొంత ప్రత్యేకత ప్రేమ ఉండడం సహజ పరిణామం. పైగా జగన్ ఏపీ సీఎం గా ఉండాలని ఆయనతో పాటుగా కేసీఆర్ కూడా గట్టిగా కోరుకుంటున్న సందర్భమిది.
దూకుడుగానే…
మరో వైపు చూసుకుంటే జగన్ కొంత దూకుడుగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాని వల్ల వచ్చే పరిణామాలను ఆయన అంచనా వేయలేకపోతున్నారన్నది ఇసుక కొరత వంటి సమస్యల విషయంలో రుజువైంది. అయితే అవి కాలంతో పాటే సర్దుకున్నాయి. ఇక అమరావతి రాజధాని మూడుగా చేయడం అన్నది బహుముఖీయమైన సమస్యలకు దారితీస్తుందా అన్న సందేహం సొంత పార్టీలో కూడా ఉంది. అయినా జగన్ తలచుకుంటే ఆయనకు సలహా చెప్పే సాహసం ఎవరూ వైసీపీలో చేయలేరు. దాంతో జగన్ ఇపుడు ముందుకు సాగుతున్నారు. ఈ మధ్య కేసీఆర్ తో జరిగిన భేటీలో చూసుకుంటే జగన్ మనస్తత్వం ఎరిగిన వారు ఎవరూ ఆయన ఇలాంటి విషయాల్లో ఇంకొకరి సలహా అడుగుతారని కూడా అనుకోరు. అయినా కేసీఆర్ మూడు రాజధానులకు సుముఖం అన్నారని టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేసింది. వన్ టు వన్ చర్చలు ఎలా బయటకు వచ్చాయో ఆ మీడియాకే ఎరుక. కానీ ఈ విషయంలో మాత్రం కేసీఆర్ అలా చెప్పలేదు అనడానికి తాజాగా ఆయన కుమారుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన హాట్ కామెంట్స్ పెద్ద ఉదాహరణ.
జాగ్రత్త చెప్పారా…?
ఏపీలో మూడు రాజధానులకూ, కొత్త జిల్లాలకూ కేటీఆర్ పోలిక తెస్తూ తాము 10 నుంచి 33 జిల్లాలు తెలంగాణాలో చేసినపుడు కనీసం ఒక్క గొంతు కూడా నిరసన తెలపలేదని, అదే మూడు రాజధానులపై ప్రతిపాదనలు రాగానే పెద్ద ఎత్తున ఆందోళలను ఏపీలో పుడుతున్నాయంటే కాస్తా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమేనని కేటీఆర్ అనడం వెనక జగన్ కి జాగ్రత్త చెబుతున్నట్లుగానే భావించాలి. జగన్ తమకు మిత్రుడు కాబట్టి ఆయన ఏపీలో రాజకీయంగా ఇబ్బందులపాలు కాకూడదన్న ధోరణిలోనే కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారని అనుకోవాలి. అదే సమయంలో మూడు రాజధానులకు అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ కేటీఆర్ ఎలాంటి కామెంట్స్ చేయడంలేదు, పాలకుకు సమస్యలు లేకుండా ఎటువంటి విభజనలు, వికేంద్రీకరణలు చేయాలని మాత్రమే సూచించారు. మరి మంచి మిత్రుడిగా కేసీఆర్ తరఫున నుంచి కేటీఆర్ నోటి ద్వారా ఈ సూచన వచ్చిందని భావించి జగన్ దీన్ని గట్టిగా ఆలోచిస్తారా. చూడాలి మరి.