ఇక కేసీఆర్ బిగ్ టాస్క్ అదేనట
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరివేతలు, తీసివేతలు ప్రారంభించారు. సొంత పార్టీని ప్రక్షాళన చేయడంతో పాటు బీజేపీని నిలువరించడమే కేసీఆర్ టాస్క్ గా కనపడుతుంది. ఇంకా సార్వత్రిక ఎన్నికలకు [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరివేతలు, తీసివేతలు ప్రారంభించారు. సొంత పార్టీని ప్రక్షాళన చేయడంతో పాటు బీజేపీని నిలువరించడమే కేసీఆర్ టాస్క్ గా కనపడుతుంది. ఇంకా సార్వత్రిక ఎన్నికలకు [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరివేతలు, తీసివేతలు ప్రారంభించారు. సొంత పార్టీని ప్రక్షాళన చేయడంతో పాటు బీజేపీని నిలువరించడమే కేసీఆర్ టాస్క్ గా కనపడుతుంది. ఇంకా సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉంది. ఈ రెండేళ్లలో పార్టీని గాడిన పెట్టడంతో పాటు బీజేపీిని బలహీన పర్చడం ఆయన ప్రధాన లక్ష్యం. ఇందుకోసం ఆయన అనేకరకమైన సమాలోచనలు చేస్తున్నారని తెలిసింది.
పార్టీ ప్రక్షాళన….
ముందుగా పార్టీ ప్రక్షాళన ను కేసీఆర్ ప్రారంభించారు. భవిష్యత్ లో తనకు, తన కుటుంబానికి ఇబ్బందికరంగా మారతారన్న వారిని ఏరివేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈటల రాజేందర్ తో మొదలయింది. మరికొందరు నేతలను కూడా ఎన్నికల సమయానికి పక్కన పెట్టే అవకాశాలున్నాయని తెలిసింది. ఈటల రాజేందర్ ను బర్త్ రఫ్ చేసి తమ ప్రాంతాల్లో తామే మొనగాళ్లమని భావిస్తున్న పార్టీనేతలకు కేసీఆర్ బలమైన సంకేతాల పంపారు.
బీజేపీని నిలువరించడం…
ఇక తెలంగాణలో కాంగ్రెస్ పూర్తిగా చచ్చిపోయింది. దానిని వచ్చే ఎన్నికలలో పరిగణనలోకి తీసుకోవడమూ వృధా అని కేసీఆర్ భావిస్తున్నారని తెలిసింది. కాంగ్రెస్ పార్టీని తాము ఏమీ చేయకపోయినా ఆ పార్టీ నేతలే నాశనం చేసుకుంటారని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి ఏడేళ్లు కానుండటంతో ఇక కాంగ్రెస్ ను టార్గెట్ చేయడం వృధా అన్నది కేసీఆర్ భావన. అందుకే తన లక్ష్యమంతా ఇప్పుడు బీజేపీపైనే ఉందంటున్నారు.
కొన్ని ప్రాంతాల్లోనే…?
వరసగా నాగార్జున సాగర్, మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుతో బీజేపీని కొంత కట్టడి చేయగలిగారు. ఇదే సమయంలో బీజేపీని ఇరుకున పెట్టేలా రానున్న కాలంలో కేసీఆర్ మరిన్ని వ్యూహాలు ఉండబోతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని, అయితే అది అన్ని ప్రాంతాల్లో బలంగా లేదని, కొన్ని ప్రాంతాలకే పరిమితమయిందని ఆయన నేతలకు చెబుతున్నారు. అక్కడ మాత్రమే బీజేపీని టార్గెట్ చేస్తే సరిపోతుందని, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బీజేపీ పై ప్రత్యేక దృష్టిపెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. మొత్తం మీద ఈ రెండేళ్లలో కేసీఆర్ బిగ్ టాస్క్ అదేనట.