‘గులాబీ బాస్ స్కెచ్ అందుకేనా ?
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొద్దికాలంగా మంచి దూకుడు మీద ఉన్నారు. ఎప్పుడైతే తన కుడిభుజంగా తెలంగాణ ఉద్యమంలో వ్యవహరించిన ఈటల రాజేందర్ [more]
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొద్దికాలంగా మంచి దూకుడు మీద ఉన్నారు. ఎప్పుడైతే తన కుడిభుజంగా తెలంగాణ ఉద్యమంలో వ్యవహరించిన ఈటల రాజేందర్ [more]
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొద్దికాలంగా మంచి దూకుడు మీద ఉన్నారు. ఎప్పుడైతే తన కుడిభుజంగా తెలంగాణ ఉద్యమంలో వ్యవహరించిన ఈటల రాజేందర్ ను కేసీఆర్ మంత్రి వర్గం నుంచి బయటకు పంపి చివరకు కారు దిగి కమలం పెట్టుకునేలా చేశారో అప్పటినుంచి ఆయన రాజకీయ ఎత్తుగడలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయం గా మారాయి. ఫామ్ హౌస్ సిఎం గా విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొన్న కేసీఆర్ ఇప్పుడు ప్రజల్లో సుడిగాలిలా తిరుగుతున్నారు. ఈ పరిణామాలన్నిటికి రెండు కారణాలను రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
కరోనా వార్డ్ లలో …
కేసీఆర్ వ్యూహాలు ప్రత్యర్థులకు అంతు చిక్కవు. సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న సమయంలో హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో, వరంగల్ లోని ఆసుపత్రులను సందర్శించారు గులాబీ నేత. నేరుగా కరోనా రోగుల దగ్గరకు పిపిఈ కిట్ సైతం లేకుండా మాస్క్ ధరించే ధైర్యంగా వెళ్లి వారికి ధైర్యం చెప్పారు. ఆ తరువాత లాక్ డౌన్ ఎత్తివేసి జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టేసి జనంలో ప్రత్యక్షం అయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలాంటి స్పీడ్ చుపించారో అదే రీతిలో సాగిపోతు అందరిని ఆక్స్చర్య పరుస్తున్నారు కేసీఆర్.
కాంగ్రెస్ నేతలకు అపాయింట్మెంట్ ఇచ్చి …
వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఎప్పుడు విపక్షాలను గౌరవించింది లేనేలేదని చెప్పొచ్చు. ఎంఐఎం తో ఎన్నికల తరువాత కార్పొరేషన్ ఎన్నికల తరువాత బిజెపి నేతలకు మాత్రమే అపాయింట్మెంట్ ఇచ్చిన కారు పార్టీ అధినేత చాలాకాలం తరువాత కాంగ్రెస్ నేతలకు సమయం కేటాయించి హాట్ టాపిక్ కు తెరలేపారు. మరియమ్మ అనే దళిత మహిళ లాకప్ కేసుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు భట్టి తదితరులు ఆందోళన చేపట్టారు. గవర్నర్ ను సైతం కలిసి వారు వినతిపత్రం ఇచ్చారు. ఈ వ్యవహారం పై కేసీఆర్ ను కలుసుకోవాలంటూ సిఎం పేషీ నుంచి భట్టి బృందానికి సమాచారం వచ్చింది. వెంటనే అందుబాటులో ఉన్న నేతలతో కలసి భట్టి కేసీఆర్ ను కలిశారు. ఆ వెంటనే ఆయన బాధిత మహిళ కు సంబంధించిన కేసును విచారించి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. మృతురాలి కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కుమార్తెలకు పది లక్షల రూపాయల చొప్పున మరో పదిహేను లక్షల రూపాయలు ప్రకటించేశారు. ఇలా విపక్షాలు తీసుకువచ్చిన సమస్యను క్షణాల్లో పరిష్కరించి షాక్ ఇచ్చేశారు.
టార్గెట్ అదేనా ?
ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలన్న వ్యూహమా ఇప్పుడు గులాబీ బాస్ అనుసరిస్తున్నారు అనే అనుమానాలు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ ను ఆకస్మికంగా కలిసిన బృందంలో పిసిసి రేసులో ముందు వరసలో ఉన్న రేవంత్ రెడ్డి లేరు. కేసీఆర్ అంటే ఒంటికాలిపై లేచే రేవంత్ లేకుండా ఈ సీన్ అంతా నడిచింది. కాంగ్రెస్ లో గ్రూప్ ల తీరే ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉంటుందనుకోవచ్చు . కానీ ఈ పరిణామాలు ఆ పార్టీలో మరింత చిచ్చు పెట్టేలా మరొచ్చంటున్నారు. మరోపక్క ఈటల రాజేందర్ ను సైతం అష్టదిగ్బంధనం చేసి అవసరమైతే కాంగ్రెస్ సహకారంతో హుజురాబాద్ ను గెలిచి తీరాలన్న వ్యూహం కేసీఆర్ అడుగులు వెనుక ఉందా అన్న డౌట్స్ ఇప్పుడు షికారు చేస్తున్నాయి. ఆయన అసలు వ్యూహం ఏమిటి అన్నది త్వరలోనే తేలిపోనుంది.