ముందు ముందు సినిమా చాలా ఉందట ?
కేసీఆర్ ఇప్పుడు టార్గెట్ హుజురాబాద్ ఎన్నికలుగా ముందుకు వెళుతున్నారంటే పొరపాటే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇకపై ఆయన దళితబంధు తరహాలోనే ఒక్కో పథకం బలమైన [more]
కేసీఆర్ ఇప్పుడు టార్గెట్ హుజురాబాద్ ఎన్నికలుగా ముందుకు వెళుతున్నారంటే పొరపాటే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇకపై ఆయన దళితబంధు తరహాలోనే ఒక్కో పథకం బలమైన [more]
కేసీఆర్ ఇప్పుడు టార్గెట్ హుజురాబాద్ ఎన్నికలుగా ముందుకు వెళుతున్నారంటే పొరపాటే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇకపై ఆయన దళితబంధు తరహాలోనే ఒక్కో పథకం బలమైన సామాజిక వర్గాలకు ప్రకటిస్తారన్నది స్పష్టం అయిపొయింది. అందుకే వచ్చే ఎన్నికల్లో గట్టి విజయం అందుకోవడానికి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ట్రయిల్ రన్ చేపట్టబోతున్నారని తెలుస్తుంది. దుబ్బాక ఇచ్చిన షాక్ తరువాత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగిపోయారు. పార్టీ కి ప్రజాక్షేత్రం లో బలం సన్నగిల్లుతోందని ప్రధాన విపక్షాలు బలం పుంజుకుంటున్నాయనే అంచనాలకు రావడంతో నేరుగా యుద్ధంలోకి దిగి వ్యూహాలు రూపొందిస్తున్నారు. దీనికి నాగార్జున సాగర్ ఎన్నికల నుంచి వరంగల్, ఖమ్మం వంటి కార్పొరేషన్ ఎన్నికల వరకు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.
దళిత బంధు లాగే త్వరలో?
తెలంగాణ లో వున్న బలమైన సామాజిక వర్గాల ఓట్లు గంప గుత్తగా పడేందుకు కేసీఆర్ ఒక్కో అస్త్రం బయటకు తీస్తున్నారు. మొదట దళితబంధు పథకం ప్రకటించి హుజురాబాద్ పైలెట్ ప్రాజెక్ట్ అని డిసైడ్ చేశారు. ఆ పథకం తరువాత విపక్షాల్లో ప్రకంపనలు మొదలు అయ్యాయనే చెప్పొచ్చు. దీనిపై ప్రతిపక్షాలు అన్ని నియోజకవర్గాల్లో దీన్ని అమలు చేయాలని పోరాటం చేయడం వినా ఏమి చేయలేకపోతున్నారు. తాజాగా చేనేత బంధు పథకానికి తుదిమెరుగులు దిద్దేపనిలో ఉన్నారు కేసీఆర్ . ఈ రెండు పథకాలు ఒక్క హుజురాబాద్ కే కాదు ఆ తరువాత రాబోయే రెండేళ్ళల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయకతప్పదు. వెంటనే కాకపోయినా వచ్చే ఎన్నికల ముంగిట అన్ని నియోజకవర్గాలలో ఇలాంటి తాయిలాలు ఓట్ల వర్షం గులాబీ పార్టీపై కురిపిస్తాయన్నది పార్టీ చీఫ్ కేసీఆర్ అంచనా గా ఉంది.
ఆ ఓటు బ్యాంక్ లే టార్గెట్ …
ఇప్పటికే రైతు బంధు హిట్ కావడంతో ఇకపై వరుసగా ఇలాంటి స్కీమ్స్ తో సరికొత్త రాజకీయ చరిత్రకు సిద్ధం అవుతున్నారు కేసీఆర్ . త్వరలో చేనేత బంధు రిలీజ్ అవుతుందంటున్నారు. ఆ తరువాత మైనారిటీ బంధు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ పథకాలతో తెలంగాణ ఆర్ధిక గతి దిగజారుతుందనే ఆందోళన మిగిలిన వర్గాల్లో లేకుండా ఉండేందుకు చాలా కాలం నుంచే మనది ధనిక రాష్ట్రం అనే స్లోగన్ ఇస్తూ వస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ సొంత రాష్ట్ర ఏర్పాటుతో చల్లారింది. గత ఎన్నికల్లో చంద్రబాబు పుణ్యమా అని మరోసారి అదే స్లోగన్ తో రెండోసారి అధికారంలోకి వచ్చేశారు కేసీఆర్ . ఇప్పుడు తెలంగాణ వాదానికి రోజులు చెల్లిపోయాయి. సో ఇప్పుడు పేదలను ఉద్ధరించడం అనే కాన్సెప్ట్ లో ఓట్ల వల విసరడం కోసం కేసీఆర్ వేస్తున్న ఎత్తుగడలను తెలంగాణ లో తిప్పికొట్టడానికి సిద్ధమైన బిజెపి, కాంగ్రెస్ లు ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తాయో చూడాలి.