నువ్వంటే నాకిష్టం.. నీ మాటంటే నాకిష్టం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్టయిల్ వేరు. సంక్షోభాన్ని అవకాశం గా మలుచుకోవడంలో ప్రధాని మోడీ ఎంతటి చతురతతో వ్యవహరిస్తారో అంతకు మించే గులాబీ బాస్ స్టెప్స్ వేస్తారు. [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్టయిల్ వేరు. సంక్షోభాన్ని అవకాశం గా మలుచుకోవడంలో ప్రధాని మోడీ ఎంతటి చతురతతో వ్యవహరిస్తారో అంతకు మించే గులాబీ బాస్ స్టెప్స్ వేస్తారు. [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్టయిల్ వేరు. సంక్షోభాన్ని అవకాశం గా మలుచుకోవడంలో ప్రధాని మోడీ ఎంతటి చతురతతో వ్యవహరిస్తారో అంతకు మించే గులాబీ బాస్ స్టెప్స్ వేస్తారు. ఆయన వ్యూహాలే రాదన్న తెలంగాణ రాష్ట్రాన్ని రప్పించాయి కూడా. మొన్నటి ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు దక్కించుకోవడంతో బిజెపి కన్ను తెలంగాణ పై గట్టిగానే పడింది. గట్టిగా కృషి చేస్తే పట్టు సాధించవచ్చని కమలనాధుల ఆలోచన. అందుకు అనుగుణంగానే కమలం తెలంగాణాలో శరవేగంగా అడుగులు మొదలు పెట్టేసింది. పార్టీ మరింత దూకుడుగా సాగాలంటే అదే స్పీడ్ లో ఉండే బండి సంజయ్ ను అధ్యక్ష బాధ్యతలు కూడా కట్టబెట్టేసింది.
పసిగట్టిన కేసీఆర్…
ఇప్పుడు తెలంగాణ బిజెపి అధికార ప్రతినిధి ఎవరు అంటే గులాబీ బాస్ అనేంత ప్రజలు అనుకునే స్థాయికి చేరింది. కరోనా పై యుద్ధం కోసం తరచు కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశాల్లో ప్రధాని మోడీ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అక్కడితో ఆయన ఆగడంలేదు. మోడీ పై సోషల్ మీడియా లో కానీ ఏ మీడియా లో అయినా వచ్చే విమర్శలను తనదైన స్టయిల్ లో తిప్పికొడుతున్నారు. ప్రధానిపై చిన్న ఈగ వాలినా ఏ మాత్రం సహించనని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
మోడీ మీద ఈగ వాలితే…?
గతంలో మోడీ ఇచ్చిన చప్పట్ల పిలుపు, దీప యజ్ఞం పై వస్తున్న విమర్శల పై కేసీఆర్ స్పందించిన స్థాయిలో తెలంగాణ బిజెపి కూడా ఇప్పటిదాకా మాట్లాడింది లేదు. దాంతో ఇప్పుడు గులాబీ బాస్ పై విమర్శలు, ఆరోపణలు చేసేందుకు టి బిజెపి వెనుకంజ వేస్తుంది. కాషాయ జండా రెపరెపల కోసం తహతహలాడుతున్న బిజెపికి మాత్రం మోడీ ని పొగుడుతూ చుక్కలు చూపిస్తున్నారు కేసీఆర్. ఇలా పాజిటివ్ ధోరణితో దూకుడుగా సాగుతున్న కేసీఆర్ ను ఇప్పట్లో ఏమి చేయలేమన్న రీతిలో టి బిజెపి ఆందోళన చెందుతుంది. మరి భవిష్యత్తులో తెలంగాణ లో ఎలాంటి కొత్త రాజకీయాలు చోటుచేసుకుంటాయి అన్నది ఆసక్తికరం.