మోనార్క్ అనుకుంటే….ముప్పు తప్పదా?
నాయకలు ఫేస్ మీద నడిచే పార్టీలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటేనే పార్టీ కొన్నాళ్లు పాటు కొనసాగుతుంది. నాయకుడు ఎవరైనా తానే అన్నింటికీ [more]
నాయకలు ఫేస్ మీద నడిచే పార్టీలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటేనే పార్టీ కొన్నాళ్లు పాటు కొనసాగుతుంది. నాయకుడు ఎవరైనా తానే అన్నింటికీ [more]
నాయకలు ఫేస్ మీద నడిచే పార్టీలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటేనే పార్టీ కొన్నాళ్లు పాటు కొనసాగుతుంది. నాయకుడు ఎవరైనా తానే అన్నింటికీ అతీతం అన్న రీతిలో వ్యవహరిస్తే కొన్నాళ్ల వరకూ బాగానే ఉంటుంది. రాను రాను అది వికటిస్తుంది. ఏ నాయకుడికైనా అదే జరుగుతుంది. తాను కుక్కను నిలబెట్టినా గెలుస్తారన్న అతివిశ్వాసాన్ని ఎన్టీఆర్ ప్రదర్శించారు. చివరకు అదే ఎమ్మెల్యేల చేతిలో పరాభవం ఎదురయింది.
క్షేత్రస్థాయిలో పరిస్థితులను….
నాయకుడనే వాడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి మసలుకోవాల్సి ఉంటుంది. తన వల్లే ప్రతి ఎన్నికల్లో గెలుస్తామనుకుంటే అది పొరపాటే అవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ఇదే జరుగుతుంది. ఆయన ఎవరినీ కలవరు. వారి మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నంచేయరు. ప్రగతి భవన్ లోకి వెళ్లాలంటే మంత్రులకు కూడా సాధ్యం కాదు. ఇది కేసీఆర్ పై తెలంగాణ సమాజంలో వ్యతిరేకత రావడానికి కారణమయింది.
ఇప్పుడు సెంటిమెంట్ లేదు….
ఎప్పుడూ ఒకే సెంటిమెంట్ ఉండదు. ఆంధ్ర పాలకులు వెళ్లిపోయి ఆరేళ్లు పైనే అయింది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ఎంత చెప్పినా, గత పాలకుల మీద పాపాలను నెట్టే ప్రయత్నం చేయాలనుకున్నా అది తెలంగాణలో వర్క్ అవుట్ కాదు. తాను గెలిపిస్తేనే ఎమ్మెల్యేలు అయిన వాళ్లు కొద్దిమందే ఉంటారు. చాలా మంది వ్యక్తిగత ఇమేజ్ తోనూ, ప్రజల్లో వారికున్న బలంతో గెలిచిన వారు కూడా ఉన్నారు. నేతలు పార్టీని వదిలి వెళితే ఏం కాదులే అనుకోవడం తనను తాను సముదాయించుకోవడం తప్ప జరగాల్సిన నష్టం ఎప్పటికైనా జరగక మానదు.
నష్టం ఇప్పుడు కన్పించకున్నా….
స్వామి గౌడ్ విషయానికి తీసుకుంటే కేసీఆర్ ఆయనకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు. ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉన్న స్వామిగౌడ్ ను ఎమ్మెల్సీని చేసి మండలి ఛైర్మన్ ను కూడా చేశారు. ఆయనకు మరోసారి పదవి ఇవ్వలేదు. పదవి ఇవ్వకపోతే ఇవ్వకపోయారు. కనీసం ఆయన రెండేళ్ల నుంచి కలిసే ప్రయత్నం చేస్తున్నా కలిసేందుకు సమయం ఇవ్వలేదు. దీంతోనే స్వామిగౌడ్ పార్టీని వీడి వెళ్లిపోయారు. స్వామి గౌడ్ వెళ్లడం వల్ల పార్టీకి ఎంత నష్టమన్నది పక్కన పెడితే.. ఇప్పుడయితే చాలా డ్యామేజీ అయిందన్నది విశ్లేషకుల వాదన. ఇప్పటికైనా కేసీఆర్ తన తీరు మార్చుకోవాలని కోరుతున్నారు.