బీజేపీ ట్రాప్ లో పడిపోతారా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు గత ఏడేళ్లలో ఎప్పుడూ లేని విధంగా క్లిష్ట సమస్యను ఎదుర్కొంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు గత ఏడేళ్లలో ఎప్పుడూ లేని విధంగా క్లిష్ట సమస్యను ఎదుర్కొంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు గత ఏడేళ్లలో ఎప్పుడూ లేని విధంగా క్లిష్ట సమస్యను ఎదుర్కొంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పూర్తి స్థాయి విజయం దక్కకపోవడం ఆయనను కుంగదీస్తున్నాయి. ఇప్పుడు మరో సవాల్ కేసీఆర్ ఎదుట ఉంది. మేయర్ పీఠం దక్కించుకోవాలంటే ఎంఐఎంతో పొత్తు పెట్టుకోక తప్పదు. పరోక్షంగా, ప్రత్యక్షంగానైనా కలిస్తే తప్ప మేయర్ పీఠం దక్కే అవకాశం లేదు. ఇదే కేసీఆర్ ను ఆలోచనలో పడేసింది.
ఎంఐఎంతో కలిస్తే…..
తెలంగాణ ఉద్యమాన్ని ఒంటిచేత్తో నడిపి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ఇప్పుడు బీజేపీ ట్రాప్ లో పడిపోయినట్లే కన్పిస్తుంది. కేసీఆర్ ఎంఐఎం చేతులో కీలుబొమ్మగా మారారని బీజేపీ ఆరోపిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లోనూ బీజేపీ ప్రధాన ప్రచారాస్త్రం ఇదే. అయితే తాము ఎంఐఎంతో పాత్తు పెట్టుకోలేదని, దాని అవసరం కూడా లేదని పదే పదే కేసీఆర్, కేటీఆర్ లు చెప్పారు. కానీ ఫలితాల తర్వాత ఎంఐఎంతో పొత్తు అవసరం ఏర్పడింది.
కలవకపోతే…..
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కేవలం 55 స్థానాల్లోనే విజయం సాధించింది. మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలంటే 98 స్థానాలు అవసరం. కానీ ఎక్స్ అఫిషియో సభ్యులను కలుపుకున్నా టీఆర్ఎస్ కు 87 మంది మాత్రమే ఉన్నారు. దీంతో కేసీఆర్ కు మేయర్ పీఠం దక్కించుకోవాలంటే ఎంఐఎం మద్దతు అనివార్యం. ఎంఐంఎం 44 స్థానాలను గెలుచుకోవడంతో అది డిప్యూటీ మేయర్ పదవి అడిగే ఛాన్స్ ఉంది.
ఏ నిర్ణయం తీసుకున్నా……?
ఇక మేయర్ ఎన్నిక సందర్భంగా ఎంఐఎం గైర్హాజరయితే ఆ పీఠం టీఆర్ఎస్ కు దక్కుతుంది. అది జరిగినా ఎంఐఎం, కేసీఆర్ మైత్రిని బీజేపీ బట్టబయలు చేసే ఛాన్స్ ఉంది. బీజేపీ ఇన్నాళ్లూ చేసిన ఆరోపణలకు కేసీఆర్ బలం ఇచ్చినట్లవుతుంది. అందుకే కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. స్థానాలు తక్కువగా రావడంతో మేయర్ పీఠంపై కూడా ఎక్కువ పోటీ నెలకొనే అవకాశముంది. మొత్తం మీద కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్ లో బీజేపీకి మంచి అవకాశమిచ్చినట్లేనన్నది నిపుణుల అభిప్రాయం. మరి కేసీఆర్ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఉత్కంఠగా మారింది.