మొహం చెల్లక డుమ్మా కొట్టారా ?
ఒకరు యుపిఎ అధికారంలోకి వచ్చేస్తుంది చక్రం తిప్పేద్దామనుకున్నారు. ఇంకోరు బిజెపి, కాంగ్రెస్ లేని రాజకీయం దేశానికి చూపిద్దామని కలలు కని మోడీ దెబ్బకు ఖంగుతిన్నారు. వారిద్దరే నారా [more]
ఒకరు యుపిఎ అధికారంలోకి వచ్చేస్తుంది చక్రం తిప్పేద్దామనుకున్నారు. ఇంకోరు బిజెపి, కాంగ్రెస్ లేని రాజకీయం దేశానికి చూపిద్దామని కలలు కని మోడీ దెబ్బకు ఖంగుతిన్నారు. వారిద్దరే నారా [more]
ఒకరు యుపిఎ అధికారంలోకి వచ్చేస్తుంది చక్రం తిప్పేద్దామనుకున్నారు. ఇంకోరు బిజెపి, కాంగ్రెస్ లేని రాజకీయం దేశానికి చూపిద్దామని కలలు కని మోడీ దెబ్బకు ఖంగుతిన్నారు. వారిద్దరే నారా చంద్రబాబు నాయుడు, టి సిఎం కె చంద్రశేఖర రావు లు. అఖండ విజయంతో ప్రధానిగా మోడీ పీఠం ఎక్కడంతో ఆయనకు మొహం చూపించడానికి సైతం వీరిద్దరికి ఇబ్బందిగానే వుంది. ముఖ్యంగా ఎన్డీయే లో వుంటూ మోడీని వ్యతిరేకించి బయటకు వచ్చి ఆయన ఓటమికి దేశవ్యాప్త ప్రచారం చేసి మరీ దెబ్బ అయిపోయారు చంద్రబాబు నాయుడు. దాంతో ఏ మొహం పెట్టి మోడీ పిలిచిన సమావేశానికి వెళతామని ఆయన డుమ్మా కొట్టేశారు.
చిన్నా చితక అన్నిటికి చలో ఢిల్లీ …
ఇద్దరు చంద్రులు ఏ చిన్న అంశం వున్నా ఢిల్లీ కి ప్రత్యేక విమానాల్లో పోటా పోటీగా వెళ్లేవారు. ఎపి సిఎం గా చంద్రబాబు నాయుడు మరీ ఎక్కువగా హస్తిన చుట్టూ తిరిగేవారు. మోడీ పెట్టె నీతి ఆయోగ్ సమావేశాల్లో తన గళం వినిపించి గాని వచ్చేవారు కాదు. ఇప్పుడు సీన్ మారిపోయింది. సొంత రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా చతికిల పడింది టిడిపి. దాంతో దేశ రాజధానిలో ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు ప్రతిష్ట మసకబారింది. తెలంగాణ చంద్రుడు ఢిల్లీ లో మొన్నటివరకు మంచి దూకుడు మీదే ఉండేవారు. ఢిల్లీ మీడియా కూడా మాటల మాంత్రికుడు కెసిఆర్ వస్తే చుట్టూ మూగేది కూడా. ఫెడరల్ ఫ్రంట్ పేరిట ఫలితాలు రాకుండా ఆయన చేసిన హడావిడి తో ఆయన ఛరిష్మా కూడా పోయింది. టి అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం తరువాత పెరిగిన కెసిఆర్ హవా పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ సంఖ్యాబలం బలహీనపడటంతో వెనక్కి పోవాలిసి వచ్చింది.
ఆల్ పార్టీ మీటింగ్ కి టోటల్ గా టిడిపి … కెటిఆర్ ను పంపి గులాబీ పార్టీ …
మోడీ ఐదు కీలక అంశాలపై అన్ని పార్టీల సమావేశం హస్తినలో నిర్వహించారు. దీనికి దేశంలోని 40 ప్రధాన రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. ఆయన ఆహ్వానాన్ని మన్నించి 21 పార్టీలు హాజరు అయ్యాయి. 24 పార్టీలు హాజరయినట్లు కేంద్ర సర్కార్ ప్రకటించింది. ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రధాన ఎజెండాగా సాగిన ఈ సమావేశం వాస్తవానికి చాలా ప్రాధాన్యతతో కూడుకున్నదే. రాజకీయ వైరుధ్యాలతో కాంగ్రెస్ సహా యుపిఎ భాగస్వామ్య పార్టీలు సమావేశానికి హాజరు కాలేదు. ఎపి నుంచి వైసిపి అధినేత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యి ప్రధాని ప్రతిపాదనలకు సై అన్నారు. టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మోడీ కి జై చెప్పేశారు. అయితే తృణమూల్, బీఎస్పీ, ఎస్పీ లు హాజరు కాకపోయినా తమ వ్యతిరేకతను తెలియచేశాయి. కామ్రేడ్ లు వ్యతిరేకించారు. డిఎంకె తమకు నచ్చలేదనేసింది. అయితే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జమిలి ఎన్నికలపై సమావేశానికి హాజరు కాలేదు సరికదా తమ పార్టీ ప్రతినిధిని సైతం దరిదాపుల్లోకి పంపలేదు. మోడీ ప్రతిపాదనలపై కూడా ఆ పార్టీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది లేదంటే ప్రధాని ముందుకు రావడానికి పసుపు దళపతి ఎంత సిగ్గు పడుతున్నారో తెలుస్తుందంటున్నారు విశ్లేషకులు.