వ్యూహం మార్చిన ముఖ్యమంత్రి, మోడీ తో పని లేదా ?
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కొత్త రూట్ లో వెళుతున్నారు. పొరుగు రాష్ట్రాలతో సఖ్యత ఉంటే చాలని భావిస్తున్నారు. అంతరాష్ట్ర సమస్యలకోసమే కేంద్రం చుట్టూ తిరగడం [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కొత్త రూట్ లో వెళుతున్నారు. పొరుగు రాష్ట్రాలతో సఖ్యత ఉంటే చాలని భావిస్తున్నారు. అంతరాష్ట్ర సమస్యలకోసమే కేంద్రం చుట్టూ తిరగడం [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కొత్త రూట్ లో వెళుతున్నారు. పొరుగు రాష్ట్రాలతో సఖ్యత ఉంటే చాలని భావిస్తున్నారు. అంతరాష్ట్ర సమస్యలకోసమే కేంద్రం చుట్టూ తిరగడం కన్నా ఇరుగు పొరుగుతో బావుంటే అన్ని పరిష్కారం అవుతాయన్నది ఆయన ఆలోచన. కే చంద్రశేఖర్ రావు (కెసీఆర్) ఇప్పుడు ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో దోస్తీ కి ఇదే ప్రధాన కారణమని తెలుస్తుంది. విభజన అనంతరం అంతులేని సమస్యలు రెండు రాష్ట్రాలు ఎదుర్కొంటున్నాయి. వీటిని పరిష్కరించాలిసిన కేంద్ర సర్కార్ పట్టించుకున్న పాపానికి పోవడం లేదు. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివిధ అంశాలపై ఒక మాట అనుకుంటే అయిపోయే సమస్యలు చాలానే వున్నాయి.
సై అన్న ఎపి సిఎం జగన్ …
ఉద్యోగుల బదిలీలు, కృష్ణ, గోదావరి జలాల పంపిణి, ఆస్తులు, అప్పుల పంపిణి ఇలా కీలక అంశాలు ఇరు రాష్ట్రాలకు పీట ముడి వేశాయి. అయితే వీటిపై ఎంత అరిచి గీ పెట్టినా కేంద్రం ముందుకు రాకపోవడంతో కే చంద్రశేఖర్ రావు (కెసిఆర్) ఒక అడుగు ముందుకేశారు. వయసులో చిన్న వాడైనా రాజకీయంలో పెద్దవాడుగా ఎదిగిన ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డి వద్దకు తానే వెళుతూ పెద్దరికం వహిస్తున్నారు. ఈ పరిణామాన్ని ఎపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా స్వాగతిస్తున్నారు. తన వంతు సహకారం అందించడాన్ని హైదరాబాద్ లోని సచివాలయ భవనాలు ప్రాక్టికల్ గా అప్పగించి చూపించారు ఎపి సిఎం. గతంలో ఎపి సిఎం గా చంద్రబాబు తెలంగాణ లో రాజకీయాలు చేయడాన్ని సహించని టి సిఎం ఉప్పు నిప్పులాగే వ్యవహారం నడుపుకుంటూ వచ్చేవారు. సర్కార్ ఏపీలో మారడంతో ఆయన హుషారు అయ్యారు. కోరుకున్న జగన్ కి జనం పట్టం కట్టడంతో దూకుడు పెంచేశారు చంద్రశేఖర్ రావు . పొరుగు తో స్నేహం సౌఖ్యం అని ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం గులాబీ బాస్ తోయుగళ గీతం అందుకున్నారు.
వారితో కూడా ఇదే వ్యూహం ….
చంద్రశేఖర్ రావు కు వారు ఏ పార్టీ వారన్నది అనవసరం. పొరుగున జెడియు సర్కార్ కొలువైన కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి తో ఎలా సఖ్యంగా ఉంటున్నారో, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ తోను అదెలా వ్యవహారం నడుపుతున్నారు. ఇక ఒడిస్సా, చత్తిస్ ఘడ్ ముఖ్యమంత్రులతోను గులాబీ టీం స్నేహ పూర్వక వాతావరణాన్ని కొనసాగిస్తోంది. ఫలితంగా అంతరాష్ట్ర సమస్యల్లో ఎలాంటి సమస్యనైనా కేంద్రం వద్దకు వెళ్లి ప్రాధేయ పడకుండా జాగర్త పడే విధానంలో సాగుతున్నారు. బచావత్ ట్రిబ్యునల్ లో దశాబ్దాలుగా సమస్యలు సాగుతున్న తీరు తో విసిగిపోయిన ఆయన దీనికి పరిష్కారం కనుగొన్నారు. పక్క ముఖ్యమంత్రులతో స్నేహం అన్ని సమస్యలను పరిష్కరించే తారక మంత్రం గా గుర్తించేశారు.