మళ్లీ లాగుతున్నారుగా?
కేఈ కృష్ణమూర్తికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆయన తెలుగుదేశం పార్టీ లో నమ్మకమైన నేతగా కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కేఈ కృష్ణమూర్తికి [more]
కేఈ కృష్ణమూర్తికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆయన తెలుగుదేశం పార్టీ లో నమ్మకమైన నేతగా కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కేఈ కృష్ణమూర్తికి [more]
కేఈ కృష్ణమూర్తికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆయన తెలుగుదేశం పార్టీ లో నమ్మకమైన నేతగా కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కేఈ కృష్ణమూర్తికి ప్రత్యేక స్థానం ఉంటుంది. మంత్రివర్గంలోనూ చోటు దక్కుతుంది. సీమ ప్రాంతంలో బలమైన బీసీనేతగా ముద్రపడిన కేఈ కృష్ణమూర్తి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాజకీయాల నుంచి విరమించుకున్నట్లు ప్రకటించారు.
రెస్ట్ తీసుకుంటున్నట్లు…..
తాను ఇకపై రాజకీయాల నుంచి రెస్ట్ తీసుకుంటున్నట్లు కేఈ కృష్ణమూర్తి స్వయంగా ప్రకటించారు. దీంతో ఆయన పొలిటికల్ గా రిటైర్ మెంట్ అయనట్లే అనుకోవాల్సి ఉంటుంది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన తర్వాత కేఈ కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు కొనసాగారు. చంద్రబాబు మంత్రివర్గంలో బాబుకు సమానంగా రాజకీయ అనుభవం ఉన్న నేత కేఈ కృష్ణమూర్తి. ఇద్దరూ దాదాపు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు.
ఓటమి పాలు కావడంతో…..
అయితే రాజకీయాలనుంచి తాను తప్పుకున్నట్లు ప్రకటించిన కేఈ కృష్ణమూర్తి తన కుమారుడు శ్యాంబాబును రంగంలోకి దించారు. పత్తికొండ కేఈ కృష్ణమూర్తికి పెట్టని కోట అయినా శ్యాంబాబు ఓటమి పాలయ్యారు. డోన్ నియోజకవర్గం నుంచి ఆయన సోదరుడు కేఈ ప్రతాప్ కూడా ఓటమి పాలయ్యారు. దీంతో కేఈ కృష్ణమూర్తి గతకొంతకాలంగా జిల్లా రాజకీయాలకు దూరంగా ఉంటూ హైదరాబాద్ లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు.
బీసీ ఓటు బ్యాంకు కోసం…
కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి దీర్ఘకాలంగా ఉన్న బీసీ ఓటు బ్యాంకు వైసీపీ వైపు మళ్లింది. బీసీలను తమ వైపునకు తిరిగి తిప్పుకోవాలని చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేఈ కృష్ణమూర్తికి పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించారు. రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని ప్రకటించిన కేఈ కృష్ణమూర్తిని తిరిగి రాజకీయంగా యాక్టివ్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఆయనకు పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించారు.