సరిగా డీల్ చేయడం లేదట
రాజకీయాలన్నాక ఎంతసేపూ.. నల్లేరుపై నడకే కాదు.. కష్టాల కడగండ్లు కూడా ఎదురవుతుంటాయి. అలాంటి సమస్యలు ఎదురై నప్పుడు వాటిని వ్యూహాత్మంగా పరిష్కరించుకోవడం అనేది రాజకీయాల్లో పెద్ద టాస్క్. [more]
రాజకీయాలన్నాక ఎంతసేపూ.. నల్లేరుపై నడకే కాదు.. కష్టాల కడగండ్లు కూడా ఎదురవుతుంటాయి. అలాంటి సమస్యలు ఎదురై నప్పుడు వాటిని వ్యూహాత్మంగా పరిష్కరించుకోవడం అనేది రాజకీయాల్లో పెద్ద టాస్క్. [more]
రాజకీయాలన్నాక ఎంతసేపూ.. నల్లేరుపై నడకే కాదు.. కష్టాల కడగండ్లు కూడా ఎదురవుతుంటాయి. అలాంటి సమస్యలు ఎదురై నప్పుడు వాటిని వ్యూహాత్మంగా పరిష్కరించుకోవడం అనేది రాజకీయాల్లో పెద్ద టాస్క్. సామదాన భేద దండోపాయాలను వినియోగించి సమస్యలను పరిష్కరించుకోవడం అనేది ప్రతి పార్టీలోనూ కామన్‌గా జరిగేదే. అందుకే, ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు.. ఆయా పార్టీలు తమ పార్టీలోని కీలక నేతలను వినియోగించుకుని, వ్యూహాత్మకంగా బయట పడుతుంటాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల్లోనూ ఈ తరహా సంస్కృతి ఉంది. ఇక, ప్రాంతీయ పార్టీల్లోనూ కీలక నాయకులు ఇలాంటి సమస్యలను పరిష్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
విజయసాయిలాగా….
వైసీపీ విషయానికి వస్తే.. ఈ పార్టీకి అందివచ్చిన నాయకుడు విజయసాయిరెడ్డి. ఏ సమస్య వచ్చినా.. ఆయన అధినేత వ్యూహాన్ని సంపూర్ణంగా అమలు చేసి ఇట్టే పరిష్కరించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఆయన ఈ ఏడాది ఎన్నికలకు ముందు అనేక సమస్యలను పరిష్కరించి ట్రబుల్ షూటర్‌గా వైసీపీలో మంచి గుర్తింపు పొందారు. నొప్పింపక తానొవ్వక.. అనే రీతిలో అధినేత ఆదేశాలను అమలు చేస్తూనే ఎదుటి పక్షానికి ఇబ్బంది లేని రీతిలో సమస్యలు పరిష్కరించారు. ఇక, ఇదే తరహాలో టీడీపీ కూడా అనేక సమస్యలు ఎదుర్కొంది. ఎన్నికలకు ముందు, తర్వాత కూడా ఈ పార్టీకి పెను సవాళ్లు వచ్చాయి.
రవి విషయంలోనూ….
ఈ సమయంలో టీడీపీ తరఫున ట్రబుల్ షూటర్‌గా చంద్రబాబు విజయవాడ ఎంపీ కేశినేని నానిని వినియోగించారు. ఎన్నికలకు ముందు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అప్పటి నాయకుడు యలమంచిలి రవి.. పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో ఈ విషయం బయటకు పొక్కగానే చంద్రబాబు ఆయన వద్దకు కేశినేని నానిని దౌత్యం కోసం పంపారు. రెండు రోజుల పాటు కేశినేని నాని రవితో చర్చలు జరిపారు. కానీ,కేశినేని నాని ప్రయత్నం విఫలమైంది. రవి నేరుగా వెళ్లి వైసీపీలో చేరిపోయారు. ఇక, ఇటీవల గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఆయన వద్దకు కూడా చంద్రబాబు కేశినేని నానిని దౌత్యానికి పంపారు. అయితే,ఇది కూడా విఫలమైంది.
వంశీ వ్యవహారంలోనూ….
రెండు రోజుల పాటు చర్చించినా.. కేశినేని నాని మాట వంశీ ఎక్కడా పట్టించుకోలేదు. మధ్యలో కేశినేని నాని పార్టీపై అసమ్మతి గళం వినిపించినా కూడా బాబు ఆయనకే వంశీని బుజ్జగించే బాధ్యతలు అప్పగించారు. ఇక గతంలో కూడా బొండా ఉమా పలుసార్లు పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేసినప్పుడు కేశినేని నాని వెళ్లినా నానిని సైతం ఉమా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈ పరిణామాల తర్వాత కేశినేని నాని వైఖరిపై టీడీపీలో చర్చ జరుగుతోంది. ట్రబుల్ షూటర్‌గా ఆయనపై సందేహాలు కమ్ముకున్నాయి. సమస్య పరిష్కారంలో ఆయన వ్యూహం లేకుండా వెళ్తున్నారా? అనే ప్రశ్నలు తమ్ముళ్ల మధ్యే తిరుగుతాడుతున్నాయి. వాస్తవానికి ముక్కు సూటితనం, తనకు ఏదనిపిస్తే.. అది మాట్లాడేయడం వంటి లక్షణాలున్న కేశినేని నానిలో లౌక్యం లేదనేది వాస్తవం. ఈ నేపథ్యంలో ట్రబుల్ షూటర్ గా ఆయన విఫలమవుతున్నారని తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.