Kesineni nani : నాని చేతిలో స్టీరింగ్ ఎటువైపు?
రాజకీయాల్లో మౌనం ఎప్పడూ అనేక అర్థాలకు దారితీస్తుంది. రాజకీయ నేతలు మౌనం వహించరు. అది అధికార పార్టీ అయినా, విపక్ష పార్టీ అయినా స్పందిస్తుంటేనే ఆ పార్టీలో [more]
రాజకీయాల్లో మౌనం ఎప్పడూ అనేక అర్థాలకు దారితీస్తుంది. రాజకీయ నేతలు మౌనం వహించరు. అది అధికార పార్టీ అయినా, విపక్ష పార్టీ అయినా స్పందిస్తుంటేనే ఆ పార్టీలో [more]
రాజకీయాల్లో మౌనం ఎప్పడూ అనేక అర్థాలకు దారితీస్తుంది. రాజకీయ నేతలు మౌనం వహించరు. అది అధికార పార్టీ అయినా, విపక్ష పార్టీ అయినా స్పందిస్తుంటేనే ఆ పార్టీలో యాక్టివ్ గా ఉన్నట్లు లెక్క. కానీ విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని రూటు సపరేటు గా ఉంది. ఆయన కేశినేని ట్రావెల్స్ అధినేతగా వ్యాపారంలో రాణించారు. లాభాలు గడించారు. ట్రావెల్స్ బిజినెస్ లో ప్రత్యర్థులపై పై చేయి సాధించారు. అదే సమయంలో రాజకీయాల్లో మాత్రం ఆయన ఇబ్బంది పడుతున్నారు. స్టీరింగ్ చేతిలో ఉన్నా ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. అసలు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారా? లేదా? అన్నది ఆ పార్టీ నేతలకే సందేహంగా మారింది. గత కొంతకాలంగా ఆయన మౌనంగా ఉండటమే ఇందుకు కారణం.
బాబు ఇంటిపై దాడి ఘటనలో….
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని రాజకీయ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన మౌనం దేనికి సంకేతమన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధినేత చంద్రబాబు ఇంటి మీద వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ దాడికి పాల్పడినా కేశినేని నాని నోరు మెదపలేదు. కనీసం ఖండించనూ లేదు. దీనికి కారణాలేంటన్న దానిపై పార్టీ నేతలు కూడా చర్చించుకుంటున్నారు.
కనీసం షోకాజ్ నోటీసులు….
విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా తనపై ఆరోపించిన టీడీపీ నేతలు బోండా ఉమ, నాగుల్ మీరా, బుద్దా వెంకన్నల పై పార్టీ అధినాయకత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని కేశినేని నాని ఆగ్రహంతో ఉన్నారు. ఒక ఎంపీపై ఆరోపణలు చేసిన వారికి కనీసం షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తనను పార్టీయే కాదనుకుంటుందన్న ధోరణిలో కేశినేని నాని ఉన్నారు.
ప్రయారిటీ వారికే….
వారిని మందలించకపోగా వారికే ప్రయారిటీ ఇవ్వడం, పార్టీ పదవులు కూడా వారికే ఇవ్వడాన్ని కేశినేని నాని తప్పపడుతున్నారు. చంద్రబాబు ఇంటి దాడి సమయంలోనూ అక్కడ బుద్దా వెంకన్న, నాగుల్ మీరా ఉండటంతో ఆ దాడి పై కూడా కేశినేని నాని సైలెంట్ గా ఉన్నారని తెలిసింది. మొత్తం మీద కేశినేని నాని తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని అర్థమవుతుంది. అదే సమయంలో పార్టీ హైకమాండ్ కూడా ఆయనను పెద్దగా పట్టించుకోవడం లేదనే అనుకోవాలి.