కేశినేని ప్యాకప్ చేప్పేస్తారా…?
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని పార్టీకి గుడ్ చై పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని వరుసగా ట్వీట్లు చేస్తున్న [more]
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని పార్టీకి గుడ్ చై పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని వరుసగా ట్వీట్లు చేస్తున్న [more]
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని పార్టీకి గుడ్ చై పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని వరుసగా ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ట్వీట్లతో పరిమితం కాకుండా సొంతపార్టీ తెలుగుదేశంను కూడా కేశినేని నాని టార్గెట్ చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ను కేశినేని నాని లక్ష్యంగా చేసుకుని ట్వీట్లు చేశారు.
వరస ట్వీట్లతో…..
దీనికి కౌంటర్ గా బుద్దా వెంకన్న సయితం కేశినేని కేశినేని నానిపై ట్వీట్ల వర్షం కురిపించారు. ఇలా తెలుగుదేశం పార్టీ నేతల మధ్యే వివాదం ప్రారంభం కావడం వివాదంగా మారింది. కేశినేని నాని ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి కొంత అసంతృప్తిగా ఉన్నారు. తాను పార్టీ వీడేది లేదని కేశినేని నాని పదే పదే చెబుతున్నారు. జగన్ వేవ్ లో తాను గెలిచి వచ్చినా పార్టీ తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని కేశినేని నాని కినుక వహించారు.
కొంత కాలంగా అసంతృప్తి…..
దీంతో గత కొద్దికాలంగా కేశినేని నాని తెలుగుదేశం పార్టీపై అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దాదాపు గంట సేపు బుజ్జగించినా పార్టీ పదవిని కేశినేని నాని స్వీకరించలేదు. దీంతో పాటుగా కేశినేని నాని దేవినేని ఉమ తన పట్ల గత ఐదేళ్లుగా అనుసరించిన వైఖరిని మనసులో పెట్టుకున్నారు. దేవినేని ఉమ గత ఎన్నికల్లో ఓటమి పాలయినా ఆయనకే ప్రాధాన్యత ఇవ్వడాన్ని కేశినేని నాని జీర్ణించుకోలేకపోతున్నారు.
చంద్రబాబుతో అమితుమీ….
తాజాగా కేశినేని నాని చంద్రబాబునాయుడును టార్గెట్ గా చేసుకుని ట్వీట్ చేశారు. చంద్రబాబు తనను వద్దనుకుంటే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని కేశినేని నాని ట్వీట్ చేశారు. ఎంపీ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానన్నారు. తనలాంటి వాళ్లు పార్టీలో ఉండాలనుకుంటే మీ పెంపుడు కుక్కలను అదుపులో పెట్టుకోవాలని కేశినేని నాని ట్వీట్ చేయడం పార్టీ నుంచి ఆయన వైదొలగడానికి సంకేతాలని చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబునాయుడు కేశినేని నాని, బుద్దా వెంకన్నలతో భేటీ కావాలని నిర్ణయించారు. జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే కేశినేని నాని పార్టీని వీడే సమయం ఎంతో దూరం లేదనిపిస్తోంది.