పెద్దారెడ్డి కోపమంతా అందుకేనా?
కేతిరెడ్డి పెద్దారెడ్డికి పీకల దాకా కోపమొచ్చింది. తనపై సోషల్ మీడియాలో అభాసుపాలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపాన్ని అణుచుకోలేక ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి [more]
కేతిరెడ్డి పెద్దారెడ్డికి పీకల దాకా కోపమొచ్చింది. తనపై సోషల్ మీడియాలో అభాసుపాలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపాన్ని అణుచుకోలేక ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి [more]
కేతిరెడ్డి పెద్దారెడ్డికి పీకల దాకా కోపమొచ్చింది. తనపై సోషల్ మీడియాలో అభాసుపాలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపాన్ని అణుచుకోలేక ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. జేసీ అనుచరులపై చేయిచేసుకున్నారు. అంతటితో ఆగలేదు. జేసీ అనుచరులకు సవాల్ విసిరారు. నిరూపించమని సవాల్ విసిరారు. తాడిపత్రిలో ఎప్పుడూ టెన్షన్ నెలకొనే ఉంటుంది. గత కొన్నేళ్లుగా జేసీ కుటుంబానికి పెట్టని కోటగా ఉన్న తాడిపత్రి నియోజవర్గాన్ని పెద్దారెడ్డి బద్దలు కొట్టారు.
ఓటమి ఎరుగని కుటుంబానికి….
మూడున్నర దశాబ్దాల నుంచి ఓటమి ఎరుగని జేసీ కుటుంబానికి దాని రుచి చూపించింది పెద్దారెడ్డి మాత్రమే. అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జేసీ వర్గీయులు పెద్దారెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. రవాణా శాఖ రిజిస్ట్రేషన్ విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి జైలుకు పంపిన నాటి నుంచి జేసీ అనుచరులు పెద్దారెడ్డిని సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు. చివరకు పెద్దారెడ్డి కుటుంబ సభ్యులపై కూడా పోస్టింగ్ లు పెడుతున్నారు.
సోషల్ మీడియాలో…..
అంతటితో ఆగకుండా ఎద్దుల బండిపై తెచ్చుకుంటున్న ఇసుకకు కూడా పెద్దారెడ్డి డబ్బులు వసూలు చేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారు. ఇది జేసీ అనుచరుల పనేనని అనుమానించిన పెద్దారెడ్డి దాడికి తెగబడ్డారు. అయితే ఆ సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యులు ఎవరూ లేరు. వారి అనుచరులపై పెద్దారెడ్డి చేయి చేసుకున్నారు. అక్కడి నుంచి వెళుతున్న సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కుర్చీలో పెద్దిరెడ్డి కూర్చున్నారు. పెద్దారెడ్డి వెళ్లిన తర్వాత జేసీ అనుచరులు ఆ కుర్చీని తగుల బెట్టారు.
ఢీ అంటే ఢీ అంటూ…..
దీంతో ఇరు వర్గాల మధ్య మళ్లీ చిచ్చురాజుకుంది. ఇరువర్గాల మధ్య రాళ్లదాడి జరిగింది. ఈ సందర్భంగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. దాడి ఘటనను తెలుసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలు హుటాహుటిన హైదరాబాద్ నుంచి తాడిపత్రికి చేరుకున్నారు. తమ అనుచరులతో సమావేశమయ్యారు. తాము కూడా పెద్దిరెడ్డి ఇంటికి వెళ్లి దాడి చేస్తామంటూ జేసీ అనుచరులు ఊగిపోయారు. అయితే అప్పటికే పోలీసులు పెద్దయెత్తున మొహరించడంతో ఇరు వర్గాలను శాంతింప చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. తాడిపత్రిలో 144 వ సెక్షన్ ను విధించారు. పోలీసులు విస్తృత బందోబస్తును నిర్వహించారు.