కేతిరెడ్డిపై తేలిపోతున్న శ్రీరామ్…టీడీపీకి కష్టమే..?
అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం మొదట నుంచి తెలుగుదేశం పార్టీకి కాస్త అనుకూలంగా ఉన్న నియోజకవర్గం. టీడీపీ ఆవిర్భావం అంటే 1983 నుంచి 2019 వరకు చూసుకుంటే [more]
అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం మొదట నుంచి తెలుగుదేశం పార్టీకి కాస్త అనుకూలంగా ఉన్న నియోజకవర్గం. టీడీపీ ఆవిర్భావం అంటే 1983 నుంచి 2019 వరకు చూసుకుంటే [more]
అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం మొదట నుంచి తెలుగుదేశం పార్టీకి కాస్త అనుకూలంగా ఉన్న నియోజకవర్గం. టీడీపీ ఆవిర్భావం అంటే 1983 నుంచి 2019 వరకు చూసుకుంటే ఇక్కడ ఎక్కువ సార్లు టీడీపీనే గెలిచింది. ధర్మవరంలో ఆరుసార్లు టీడీపీ జెండా ఎగిరింది. అలాగే రెండు సార్లు కాంగ్రెస్, ఒకసారి వైసీపీ గెలిచింది. ఇక్కడ టీడీపీకి సమర్థవంతమైన నాయకత్వాన్ని ఏర్పరిచి పార్టీ ప్రతిపక్షంలో ఉన్న 2004లో కూడా గెలిచేలా చేసిన ఘనత దివంగత పరిటాల రవిదే. అయితే ఇక నుంచి ధర్మవరంలో వైసీపీ హవానే కొనసాగేలా కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పనితీరు అలా ఉంది. 2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి 2014లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు.
నిత్యం ప్రజల మధ్యనే…..
ఇక 2019 ఎన్నికల్లో మంచి మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ధర్మవరంలో దూసుకెళుతున్నారు. నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటున్న కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి రెండేళ్లలో మంచి ఫాలోయింగ్ పెరిగింది. దివంగత మాజీ ఎమ్మెల్యే సూరీడు కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కేతిరెడ్డి నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అక్కడకక్కడే పరిష్కారం అయ్యేలా చేస్తున్నారు. అటు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు.
పథకాలను నేరుగా….
ప్రభుత్వ పథకాలు ఈయనకు ఫుల్ ప్లస్. అయితే రాష్ట్రంలో మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు మాదిరిగా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై అవినీతి, అక్రమాలు చేసినట్లు ఆరోపణలు రాలేదు. ప్రతి రోజు మార్నింగ్ వాక్ ద్వారా నియోజకవర్గంలో ఎక్కడో ఓ చోట పర్యటిస్తుండడంతో పాటు ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. ఇక అన్ని శాఖలపై పట్టు పెంచుకుని పనిచేయని అధికారులకు అక్కడే వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. జగన్ సైతం కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మోడల్ ఫాలో అయితే వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు తాను పెద్ద కష్టపడాల్సిన పని ఉండదని చెప్పారంటే ఆయన క్రేజ్ అర్థమవుతోంది.
ఆయనను నిలువరించేందుకు…?
అయితే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని నిలువరించడానికి పరిటాల శ్రీరామ్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బీజేపీలోకి వెళ్లడంతో చంద్రబాబు, ధర్మవరం బాధ్యతలు పరిటాల ఫ్యామిలీకి అప్పగించారు. దీంతో శ్రీరామ్ అటు రాప్తాడుతో పాటు ఇటు ధర్మవరం బాధ్యతలు చూసుకుంటున్నారు. కానీ ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి హవా ముందు శ్రీరామ్ తేలిపోతున్నారు. ఆయన దూకుడుకు బ్రేకులు వేసేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
స్థానిక ఎన్నికల్లోనూ….?
ఇటీవల స్థానిక ఎన్నికల్లో కూడా ధర్మవరంలో వైసీపీ హవా కొనసాగింది. ధర్మవరం మున్సిపాలిటీలో అయితే వైసీపీ క్లీన్‌స్వీప్ చేసిందంటే ఇక్కడ టీడీపీ పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి హవాని శ్రీరామ్ అడ్డుకోలేక పోతున్నారు. ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే ధర్మవరంలో పరిటాల బ్రాండ్ పనిచేయదనే చెప్పాలి.